News
News
X

Bandi Sanjay: బండి సంజ‌య్‌కి మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు, మార్చి 15న విచారణకు హాజ‌రు కావాల‌ని ఆదేశం

ఎమ్మెల్సీ క‌విత‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజ‌య్‌ కుమార్ కు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది.

FOLLOW US: 
Share:

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజ‌య్‌ కుమార్ కు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. మార్చి 15న ఉద‌యం 11 గంట‌ల‌కు కార్యాలయంలో వ్యక్తిగ‌తంగా విచారణకు హాజ‌రు కావాల‌ని మహిళా క‌మిష‌న్ బండి సంజయ్ ను ఆదేశించింది. ఓ సమావేశంలో కవితపై విమర్శలు చేస్తూ.. అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని  బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది.  ఈ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై  మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విచారణకు కూడా ఆదేశించింది. సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

బండి సంజయ్ ఏమన్నారంటే ?
శుక్రవారం ఓ బీజేపీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం కూతురు మాత్రమే గొప్ప అన్నట్లు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన ఉందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ కేసులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, తప్పు చేయకుంటే కోర్టు ద్వారా నిరూపించుకుని బయటకు రావాలని ఆయన అన్నారు. ఇంతక ముందే మీడియా వాళ్లు కవితను అరెస్ట్ చేస్తారని ఓ ప్రశ్న అడిగారని, దోషిగా తేలితే అరెస్ట్ చేయక ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.  

బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్ధించను: బీజేపీ ఎంపీ అర్వింద్ 
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై  చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. తెలంగాణలో సామెతలు చాలా ఉంటాయని, వాటిని జాగ్రత్తగా వాడాలని బండి సంజయ్ కు బీజేపీ ఎంపీ అర్వింద్ సూచించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని సూచించారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడం కంటే దర్యాప్తు సంస్థలు, విచారణ సంస్థలు అడిగిన విషయాలకు సమాధానాలు చెబితే బెటర్ అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తాను చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకోవాలన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకుంటే మంచిదన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు                       

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆరెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బండి సంజయ్ కి వ్యతిరేకంగా బీఆరెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. హైదరాబాద్ లో, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్ లో బీఆరెస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ నిరసనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన నియోజకవర్గంలో నిరసనలకు నాయకత్వం వహించారు. అదేవిధంగా తెలంగాణ భవన్ వద్ద,జూబ్లీ హిల్స్, పంజా గుట్ట వద్ద, ఢిల్లీలో బీఆరెస్ శ్రేణులు బండి సంజయ్ కి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి.  హైదరాబాద్ లోని అనేక చోట్ల బీఆరెస్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆరెస్ మహిళా కార్యకర్తలు బండిసంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు.

Published at : 13 Mar 2023 06:11 PM (IST) Tags: MLC Kavitha Bandi Sanjay Telangana Women Commission Women Commission WC Notice To Bandi Sanjay

సంబంధిత కథనాలు

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్  ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత