అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

YSRTP Congress Merger: కాంగ్రెస్ హై కమాండ్ అలా, షర్మిల దారి మరోలా - పార్టీ విలీనానికి బ్రేకులు పడ్డాయా!

YSRTP merger with Congress: షర్మిల చేసిన ధర్నా చూస్తుంటే కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి బ్రేకులు పడ్డాయా..? ఢిల్లీలో అసలేం జరిగింది అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

YSRTP merger with Congress: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం.. తుదిదశకు చేరుకున్న చర్చలు.. చక్రం తిప్పిన డీకే శివకుమార్..! అని ఇటీవల ఈ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ, శుక్రవారం షర్మిల చేసిన ధర్నా చూస్తుంటే కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి బ్రేకులు పడ్డాయా..? ఢిల్లీలో అసలేం జరిగింది అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓ రాజకీయ పార్టీ నడపాలంటే ఆర్థిక, అంగ బలంతో పాటు అనుకూల పరిస్థితులు కూడా ఉండాలి. వైఎస్ షర్మిల ఆర్థికంగా ఎలా ఉన్నప్పటికీ.. అంగబలం, అనుకూల పరిస్థితులు తెలంగాణలోనే లేవనే చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో పార్టీ విలీనం వైపు ఆమె అడుగులు వేసినట్లు కనిపిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ ముందు ఆమె కొన్ని షరతులు పెట్టారు. అదేంటంటే ఒకటి పార్టీలో సముచిత స్థానం, ఉపాధ్యక్షురాలు స్థాయి పదవి ఇవ్వడం. రెండోది తాను కోరుకున్న 10 చోట్ల ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలి. మూడో విషయం ఏంటంటే.. లోక్ సభ లేదా రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు తెలుస్తోంది. 
ఇలా మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. ఐతే.. కాంగ్రెస్ పార్టీ దీనికి ఒకే చెబుతూనే ఒక్క షరతు విధించింది. అదేటంటే... 10 సీట్లు ఏంటీ.. మెుత్తం అసెంబ్లీ టికెట్స్ నువ్వు కోరుకున్న వాళ్లకే ఇద్దాం కానీ అది తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ లో అని షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది.

ఎవరెన్ని చేసినా తెలంగాణ వ్యతిరేకిగా పేరున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల అనే ప్రచారం జనాల్లో బాగానే ఉంది. మరికొందరిలో రాజన్న బిడ్డ అనే సానుభూతి ఉంది. కానీ ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లోకి షర్మిలను ఆహ్వానించి ఆంధ్రులను ఆదరించే పార్టీగా ముద్ర వేసుకోడం సరికాదని పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తును బూచిగా చూపించిన సీఎం కేసీఆర్ .. ఈ సారి షర్మిలను చూపిస్తే వచ్చే సీట్లు తగ్గుతాయని హైకమాండ్ భావిస్తోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ లోకి షర్మిల రాకపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని పదే పదే హైకమాండ్ కు చెబుతున్నారు. 

మరోవైపు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పడిపోయింది. దానికి ఊపిరిపోయాలంటే రాజశేఖర్ బిడ్డ షర్మిలనే కరెక్ట్ ఆప్షన్. అందులోనూ కాంగ్రెస్ క్యాడర్ అంతా రాజశేఖర్ వారసత్వం అని వైసీపీలోకి చేరిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ క్యాడర్ కాంగ్రెస్ వైపు రావాలంటే ఇటువైపు కూడా రాజశేఖర్ రెడ్డి రక్తాన్ని చూపించాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ .. బలమైన ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేనలతో పోటీ పడి జనాల్లోకి వెళ్లాలంటే అది షర్మిలతో సాధ్యమవుతోంది. అందుకే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కర్ణాటక నుంచి ఆమెకు రాజ్యసభ సీటు కూడా ఇస్తామని చెబుతున్నారు. షర్మిల పార్టీలోకి వస్తే 2024 ఎన్నికల్లో పెద్దగా ప్రయోజనం లేకపోయినప్పటికీ.. 2029 ఎన్నికల్లో ఏపీలో బలమైన పార్టీగా మళ్లీ కాంగ్రెస్ కనిపిస్తుంది అన్నది రాహుల్ గాంధీ ఆలోచన.

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. అన్నతో గొడవలెందుకు అని తెలంగాణలో పార్టీ (YSRTP) పెట్టారు వైఎస్ షర్మిల. తెలంగాణలో పార్టీ నడుపుతూ ఇక్కడ దుకాణం బంద్ పెట్టి.. ఏపీకి ఎందుకు వెళ్లాలన్నది ఆమె నుంచి వినిపిస్తున్న ప్రశ్న. రెండు సీట్లు తక్కువగా ఇచ్చిన పర్లేదు తెలంగాణలోనే ఉంటానని ఆమె గట్టిగా చెబుతోంది. అందుకే ఢిల్లీలో పార్టీ విలీనంపై చర్చలు విఫలమయ్యయేమో గానీ.. వెంటనే తెలంగాణకు వచ్చి  కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. అంటే తాను ఎక్కడికి వెళ్లేది లేదు తెలంగాణలోనే ఉంటానన్న సంకేతాలు కాంగ్రెస్ హైకమాండ్ కు పంపినట్లు అయింది.

హైకమాండ్ టార్గెట్ ఒకలా.. షర్మిల టార్గెట్ మరోలా ఉండటంతో... ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి బ్రేకులు పడినట్లుగానే భావించాలని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Embed widget