News
News
వీడియోలు ఆటలు
X

వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి ఇతర రాష్ట్రాలకూ స్ఫూర్తి: సీఎం కేసీఆర్

ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య ఆరోగ్యరంగం అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా అవతరించిందని సీఎం కేసీఆర్ అన్నారు.

FOLLOW US: 
Share:

ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య ఆరోగ్యరంగం అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా అవతరించిందని సీఎం కేసీఆర్ అన్నారు. పచ్చని పంటలు, చక్కని వాతావరణం, ప్రకృతి రమణీయతతో అలరారుతున్న తెలంగాణలో  రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని “ప్రపంచ ఆరోగ్య దినోత్సవం”(ఏప్రిల్ 07) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని, అమలు చేస్తున్న పలు పథకాలను తద్వారా ప్రజలకు అందుతున్న వైద్యం, మెరుగుపడుతున్న ప్రజల ఆరోగ్యం గురించి కేసీఆర్ వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కరువైన నాటి ఉమ్మడి పాలన, నాటి గడ్డుపరిస్థితుల నుంచి నేడు తెలంగాణలో జిల్లాకో వైద్య విద్యా, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీలను  స్థాపించుకునే దశకు చేరుకుందన్నారు.  తెలంగాణ రాష్ట్రం వైద్యారోగ్యరంగంలో సాధించిన ప్రగతి దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని సీఎం అన్నారు.

ప్రజావైద్యంలో గుణాత్మక మార్పు

మెడికల్ కాలేజీల సీట్లు భారీగా పెంపు, ప్రభుత్వ దవాఖానలు, మెడికల్, నర్సింగ్ కాలేజీల్లో అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టడం ద్వారా వైద్యం సామాన్యుడికి చేరువయిందన్నారు. సాధారణ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ బెడ్ల సంఖ్య పెంపు, ప్రతి ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరికరాలు, మందులు, ల్యాబొరేటరీల ఏర్పాటుతో ప్రజావైద్యంలో గుణాత్మక మార్పు జరిగిందన్నారు.

ఆ పథకాలు ఆరోగ్య పరిరక్షణలో కీలకం 

హైదరాబాద్ సహా వరంగల్ లాంటి ముఖ్యపట్టణాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్‌ (టిమ్స్) నిర్మాణంతో ప్రభుత్వ వైద్యసేవల్లో కార్పొరేట్ వైద్యం అందబోతున్నదన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌ను అదనంగా 2500 పడకలతో విస్తరించడంతో పాటు, వరంగల్‌లో అన్ని వైద్య సదుపాయాలు ఒకే చోట లభ్యమయ్యే విధంగా మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలు, వైద్య సదుపాయాల విస్తరణ, నిరంతర పర్యవేక్షణతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ పథకాలు, కేసీఆర్‌ కిట్‌, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, ఆరోగ్య లక్ష్మీ , అమ్మఒడి, ఆరోగ్య మహిళ (ప్రత్యేక మహిళా క్లినిక్‌లు)  వంటి పథకాలు తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక భాగస్వామ్యం వహిస్తున్నాయని సిఎం తెలిపారు.

బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లు, ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం, ఉచిత డయాలసిస్ కార్యక్రమం, 108 అత్యవసర ఆరోగ్య రవాణా సేవలు, పాలియేటివ్ కేర్, కంటివెలుగు పథకం కింద మొదటి దశలో కోటిమందికి పరీక్షలు, 40 లక్షల మందికి కంటిఅద్దాలు, రెండోదశలో కోటికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు, 29 లక్షల మందికి ఉచితంగా అద్దాల పంపిణీ చేస్తూ పేదల, మహిళల, బడుగు బలహీన వర్గాలతో సహా ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు సీఎం కేసీఆర్.

దేశానికి ఆదర్శంగా నిలిచిన వైద్యారోగ్య రంగం

కేంద్రం ప్రకటించిన అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయి కంటే మెరుగ్గా ఉండటం స్వరాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనతను చాటుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్రప్రభుత్వం నిర్వహించిన హెల్త్‌ ఫిట్‌నెస్‌ కాంపెయిన్‌లో 3 కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా, తెలంగాణ 3 కేటగిరీల్లోనూ అవార్డులు సాధించడంతో పాటు, నీతి ఆయోగ్‌ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీల్లో 3 వ స్థానాన్ని సాధించిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అదే విధంగా  కేంద్ర ఆర్థిక సర్వే 2022- 2023 ప్రకారం దక్షిణ భారతదేశంలో ప్రజావైద్యంపై చేస్తున్న ఖర్చులో ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలవడంతో పాటు, వైద్యంకోసం చేసే ఖర్చులో ప్రజలపై తక్కువ భారం పడుతున్న రాష్ట్రాల్లో  దేశంలోనే తెలంగాణ 3వ స్థానంలో నిలవడం, ప్రసూతి మరణాల రేటు తగ్గింపులో దేశంలోనే 3వ స్థానంలో నిలవడం.... ప్రజారోగ్యం పై ప్రభుత్వానికున్న నిబద్ధతను స్పష్టం చేస్తున్నదనీ సీఎం తెలిపారు.

రానున్న రోజుల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగించి దేశంలోనే గొప్ప వైద్యం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని సిఎం ఆకాంక్షించారు. ఇప్పటికే దేశ విదేశాలనుంచి ఆరోగ్య పరీక్షలు ప్రత్యేక వైద్యంకోసం హైద్రాబాదుకు తరలివస్తున్న నేపథ్యంలో తెలంగాణ మెడికల్ హబ్‌గా ఘనత సాధించిందని, ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని భవిష్యత్తులో మరింతగా బలోపేతం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Published at : 06 Apr 2023 10:38 PM (IST) Tags: Health Hyderabad Telangana KCR CM KCR

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Hyderabad Metro News: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ - టాయిలెట్లు వాడితే డబ్బులు చెల్లించాల్సిందేనట!

Hyderabad Metro News: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ - టాయిలెట్లు వాడితే డబ్బులు చెల్లించాల్సిందేనట!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: కోరుకున్న సీట్లు రాలేదని టికెట్లు క్యాన్సిల్, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: కోరుకున్న సీట్లు రాలేదని టికెట్లు క్యాన్సిల్, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?