Weather Updates: ఇవాళ్టి నుంచి సూరీడుతో భద్రం- జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటున్న నిపుణులు!
Weather Updates: అకాల వర్షాలతో గత కొంతకాలంగా వాతావరణ చల్లగా మారిపోయింది. కానీ మరోసారి సూర్యుడు భగభగ మండేందుకు సిద్ధమయ్యాడు. ఈరోజు నుంచి రాష్ట్రంలో విపరీతమైన ఎండలు కాయనున్నాయి.
Weather Updates: గత కొంత కాలంగా చల్లగా మారిన వాతావరణం అందరికీ కాస్త ఊరటనిచ్చింది. కానీ మళ్లీ సూర్యుడు భగభగ మండుతున్నాడు. ముఖ్యంగా ఈరోజు నుంచి రాష్ట్రంలో పొడి వాతావారణం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. కొన్ని చోట్ల 40 డిగ్రీల సెల్సియన్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళ వారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది. ఇది బుఘవారం నాటికి అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ, తూర్పు మధ్య బంగళాఖాతంలో తుఫానుగా మారనుంది. ఇది 11వ తేదీ వరకు ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. కానీ ఆ తర్వాత దిశ మార్చకుని ఈశాన్య దిశగా తృకదులుతూ.. మరింత బలపడి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో బంగళాఖాతం నుంచి వాయుగుండం ప్రాంతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.
విపరీతంగా పెరగనున్న వడగాల్పులు
ఈరోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పారు. మంగళవారంతో వర్షాలు తగ్గుముఖం పట్టి 10వ తేదీ నుంచి విపరీతమైన వడ గాల్పులు ప్రజలను ఊపిరి ఆడనీయకుండా చేస్తాయట. థార్ ఎడారి నుంచి వచ్చే గాలులు ప్రభావం తెలుగు రాష్ట్రాలపై విపరీతంగా ఉండబోతోంది. దీని వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే ఛాన్స్ ఉంది. ఐఎండీ హెచ్చరికతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. 'మోచా' తుపానుకు సంబంధించి ఒడిశాలోని 18 జిల్లాల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాను, పిడుగుల హెచ్చరికలతో 9 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
నిన్నటి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం రోజు తెలంగాణలోని నల్గొండలో 4.5, ఆదిలాబాద్ 40.0, రామగుండం 39.6, ఖమ్మం 39.4, భద్రాచలం 38.2, హన్మకొండ 38.0, మెదక్ 37.8, మెదక్ 37.8, నిజామాబాద్ 37.4, హైదరాబాద్ 36.7, మహబూబ్ నగర్ 35.8 డిగ్లీ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అంతేకాదండోయ్ ఏపీలోనూ భారీగానే ఎండలు కాశాయి. అన్నమయ్య జిల్లా సంబేపల్లి, సత్యసాయి జిల్లా నల్లమడ, మడకశిరలో 42 డిర్గీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో వేడి తాళలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతాయని వివరించింది. రాష్ట్రంలోని 28 మండలాల్లో బుధవారం వడగాల్పులు వీచే అవకాశం ఉంని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఆయా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసం అయితే తప్ప మధ్యాహ్నం సమయాల్లో బయటకు రాకూడది వివరిస్తున్నారు.