Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Weather News: తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Rains In Hyderabad: కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ చల్లబడింది. శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వారం రోజుల నుంచి చెబుతున్నట్టుగానే తెలంగాణలో ఉరుమురు మెరుపులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా పడుతోంది.
#WATCH | Telangana: Heavy rain lashes several parts of Hyderabad. pic.twitter.com/7ofyvbG7q8
— ANI (@ANI) April 20, 2024
మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలు
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణ్‌పేట, గద్వాల్ జిల్లాల్లో రేపు కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. 22వ తేదీన ఆదిలాబాద్, కమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
#20April 8:40AM⚠️
— Hyderabad Rains (@Hyderabadrains) April 20, 2024
Entire South #Hyderabad Seeing Good Rains 🌧️
Rain Bands Will Further Cover Central City in next 30mins.#Hyderabadrains pic.twitter.com/sbSkXxZW2S
ఉష్ణోగ్రతలు చూస్తే
వర్షాలు కురుస్తున్నప్పటిక ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు రిజిస్టర్ కాబోయే ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్, కొత్తగూడెం,హన్మకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమ్రం భీమ్, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, మంచిర్యాలలో ఇవాళ రేపు 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానుంది. మంగళవారం మాత్రం మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగిలిన జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయి. ఆ మూడి జిల్లాలో రేపు ఎల్లుండి నమోదు అయ్యే ఉష్ణోగ్రతలే రిజిస్టర్ కానున్నాయి. మిగతా జిల్లాల్లో మాత్రం 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్‌లో ప్రస్తుతానికి చాలా కూల్ వాతావరణం కనిపిస్తోంది. నిన్నటి నుంచి చాలా ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. దీంతో వర్షాలం చల్లబడింది. అయినా ఇక్కపోత మాత్రం ఉండనే ఉంది. అందుకే ఇవాళ రేపు 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని... సోమ మంగళవారం మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ వారం, మంగళవారం 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత రిజిస్టర్ అవుతుందని అంటున్నారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) April 20, 2024
Today's weather forecast. pic.twitter.com/PUwFoMbvP2