అన్వేషించండి

WTC Machines: ఏటీఎంలాగా హైదరాబాద్‌లో WTC మెషిన్ - ఇక ఎనీటైం ఎప్పుడైనా కాఫీ, టీ, వాటర్

దీని పూర్తి పేరు ‘వాటర్ - టీ - కాఫీ’. ఈ మూడు పానీయాలను ఇంకో వ్యక్తి సాయం లేకుండానే మిషన్ ద్వారా పొందవచ్చు.

ఏటీఎంలు కేవలం డబ్బులు తీసుకోడానికే కాకుండా వేర్వేరు అవసరాల కోసం కూడా అందుబాటులోకి వస్తున్నాయి. నీళ్ల కోసం కూడా ఏటీఎం తరహా యంత్రాలు గతంలోనే వచ్చాయి. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ గోల్డ్ ఏటీఎంని కూడా పెట్టారు. తాజాగా డబ్ల్యూటీసీ అనే యత్రం అందుబాటులోకి వచ్చింది. దీని పూర్తి పేరు ‘వాటర్ - టీ - కాఫీ’. ఈ మూడు పానీయాలను ఇంకో వ్యక్తి సాయం లేకుండానే మిషన్ ద్వారా పొందవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన ఈ యంత్రాన్ని హైదరాబాద్ లో పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన వినోద్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ యంత్రాన్ని రూపొందించారు.

మరో వ్యక్తి అవసరం లేకుండా కేవలం క్యూఅర్ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా మనకి కావాల్సిన టీ, కాఫీ, వాటర్, బిస్కెట్స్ ఈ యంత్రం నుంచి వచ్చేస్తాయి. లక్ష రూపాయల ఖర్చుతో ఈ మెషిన్‌ని తయారు చేశామని దీని తయారీదారులు చెబుతున్నారు. సాధారణంగా ఎయిర్‌ పోర్టుల్లో, కార్పొరేట్ కంపెనీల్లో ఇలాంటి వెండింగ్ యంత్రాలు కనిపిస్తుంటాయి. వాటిలో బిస్కెట్లు, కూల్ డ్రింకులు, వాటర్ బాటిల్స్ ఉంటాయి. కానీ, టీ, కాఫీల్లాంటివి మాత్రం వాటిలో ఉండవు. ఈ యంత్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తుందని, దానికోసం స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేశామని తయారీదారులు చెబుతున్నారు.

సాధారణంగా, కూల్ డ్రింకులు, బిస్కట్ ప్యాకెట్లు వచ్చే మెషిన్ల ఖర్చు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుందని.. తాము మాత్రం డబ్ల్యూటీసీ వెండింగ్ మిషన్‌ కేవలం రూ.లక్షకే తయారు చేశామని చెప్పారు. సెకన్ల వ్యవధిలోనే టీ, కాఫీ, వాటర్‌ ఇలా ఏదైనా వచ్చేస్తుందని చెప్పారు. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కావాల్సిన పానీయాలను పొందవచ్చు. డబ్ల్యూటీసీలో మొత్తం రెండు మెషిన్లను ఉంచారు. ఒక మెషిన్ నుంచి వాటర్ బాటిల్ వచ్చేలా చేశారు. మరో మెషిన్ లో పూర్తిగా టీ, కాఫీ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మిషన్ పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేమెంట్ లింక్ ఫోన్‌లో వస్తుంది. యూపీఐ పేమెంట్ చేయడం ద్వారా పేమెంట్ పూర్తి కాగానే సెలెక్ట్ చేసుకున్న పానీయం వస్తుంది.

ఈ యంత్రంలో 100 నీళ్ల బాటిళ్లు, 200 టీ లేదా కాఫీ, 50 బిస్కెట్ ప్యాకెట్ల స్టాక్ ఉంచుతారు. నిల్వలు అయిపోయిన వెంటనే ఆ యంత్రం నిర్వహిస్తున్న వారికి ఒక అలర్ట్ వెళ్తుంది. వాళ్లు వెంటనే స్టాక్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ తరహా మెషిన్లను త్వరలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. మొదటిసారిగా ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్ భవనంలో దీనిని ప్రారంభించారు. జెమ్ ఓపెన్ క్యూబ్ సంస్థ ఆధ్వర్యంలో టెక్నాలజీని ఉపయోగించి దీనిని ప్రారంభించారు. నగర వ్యాప్తంగా ఈ మెషిన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Komatireddy Rajgopal Reddy: మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి మరోసారి..! ఈసారైనా గుడ్‌న్యూస్ వింటారా?
మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి..! ఈసారైనా గుడ్‌న్యూస్ వింటారా?
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget