అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hyderabad: హైదరాబాద్‌కు అమెరికా దిగ్గజ మీడియా, వినోద రంగ సంస్థ- వెయ్యి మందితో ఆఫీస్ ఏర్పాటు చేసిన వార్నర్ బ్రదర్స్

Hyderabad: హైదరాబాద్ లో అమెరికా దిగ్గజ మీడియా, వినోద రంగ సంస్థ అయిన వార్నర్ బ్రదర్స్ ఆఫీస్ ఏర్పాటు చేసింది.

Hyderabad: హైదరాబాద్ కు మరో అమెరికా సంస్థ వచ్చింది. అగ్ర దేశానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ నగరంలో తమ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దిగ్గజ మీడియా, వినోద రంగ సంస్థగా పేరున్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీ.. ఐటీ కారిడార్ లోని కాపిటల్యాండ్ టవర్ లో కొత్తగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఒకేసారి 1200 మందికి పైగా ఉద్యోగులు పని చేసేలా సువిశాలమైన ఆఫీస్ స్పేస్ ను తీసుకుంది. 

ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. న్యూయార్క్ పర్యటనలో భాగంగా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో తమ ఆఫీస్ ను ఏర్పాటు చేస్తాని ఆ సమయంలోనే వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఈ దిగ్గజ సంస్థ ఐటీ కారిడార్ రాయదుర్గంలోని కాపిటల్యాండ్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో ఐటీ రంగానికే కాకుండా మీడియా, వినోద రంగానికీ  అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉండటంతో కంపెనీ వృద్ధికి ఈ పరిస్థితులు దోహదం చేయనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నగరంలో ఆఫీస్ ను ఏర్పాటు చేయడం ద్వారా వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ భారతీయ మార్కెట్ లోని అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

ఇటీవల దుబాయ్ లో పర్యటించిన కేటీఆర్ పలు వ్యాపార, వాణిజ్య సంస్థ ప్రతినిధి బృందాలతో భేటీ అయి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య అనుకూలతలను వారికి కేటీఆర్ వివరించారు. ఇక్కడి పెట్టుబడుల స్నేహపూర్వక వాతావరణాన్ని గురించి తెలియజెప్పారు. టీఎస్ బీపాస్ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు ముందుకు వచ్చాయి. మంగళవారం(సెప్టెంబర్ 5) నాడు రూ.1,040 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. 

అగ్నిమాపక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా పేరున్న యూఏఈ సంస్థ నాఫ్కో(NAFFCO) తెలంగాణలో రూ. 700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించింది. ఈ మేరకు నాఫ్కో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్.. మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని కేటీఆర్ చేసిన ప్రతిపాదనకు సైతం నాఫ్కో సీఈవో అంగీకరించారు. దాదాపు 100కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రూ. 215 కోట్ల పెట్టుబడితో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్ డీపీ వరల్డ్ తెలిపింది. డీపీ వరల్డ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ మెహతా, సంస్థ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ డైరెక్టర్ సాలుష్ శాస్త్రి, ఇతర ఉన్నతాధికాకరులు మంగళవారం మంత్రి కేటీఆర్ తో దుబాయి లో భేటీ అయ్యారు. పోర్టు ఆపరేటర్ గా ప్రపంచంలోనే అగ్రభాగాన ఉన్న డీపీ వరల్డ్ హైదరాబాద్ లో తమ ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో ఆపరేషన్ కోసం రూ. 165 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయరంగ ప్రగతికి చేదోడుగా నిలిచే కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్ రంగంలో కూడా డీపీ వరల్డ్ పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. మేడ్చల్ ప్రాంతంలో రూ. 50 కోట్లతో 5000 ప్యాలెట్ కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌజ్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామన్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget