అన్వేషించండి

Harish Rao Vs ministers: హరీష్‌ వర్శెస్‌ మంత్రులు- శ్వేతపత్రంపై అసెంబ్లీలో హోరాహోరీ

Telangana Assembly Sessions: తెలంగాణలో వారం పదిరోజులుగా కాగుతున్న నీళ్ల పంచాయితీ ఇంకా చల్లారలేదు. అసెంబ్లీ లోపల బయట దీనిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Telangana Ministers Vs Harish Rao: తెలంగాణలో వారం పదిరోజులుగా కాగుతున్న నీళ్ల పంచాయితీ ఇంకా చల్లారలేదు. అసెంబ్లీ లోపల బయట దీనిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నిస్తుంటే.. గత ప్రభుత్వ హయంలో ఇన్ని అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కారు ప్రజల ముందు రిపోర్టులు పెడుతోంది. 
కాంగ్రెస్, బీఆర్‌ఎసస్ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో భాగంగా నేడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఇవాళ ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టారు. దీని కారణంగా మరోసారి ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా మాటల తూటాలు పేలాయి. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత మాట్లాడిన మాజీ మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా హరీష్‌రావుకు మంత్రుల మధ్య వర్డ్స్‌ వార్‌ జరిగింది. 

హరీష్‌రావు మాట్లాడుతున్నంత సేపు మంత్రులు అభ్యంతరం చెబుతూనే ఉన్నారు. ఆయన చేసే కామెంట్స్‌కి, చెప్పే విషయంపై కౌంటర్‌లు వేస్తూనే ఉన్నారు. ఒక్కోచోట ఒక్కోలా లెక్కలు చెప్పారని ఆరోపించారు హరీష్‌రావు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మొదలైన వాగ్వాదం సభ వాయిదా పడే వరకు సాగుతూనే ఉంది. హరీష్‌రావు సుమారు గంటన్నర మాట్లాడితే అందులో 40 నిమిషాల పాటు అధికార పార్టీ అభ్యంతరాలే ఉన్నాయి. 

ఈ విషయంపై అసెంబ్లీ లాబీల్లో హరీష్‌రావు కీలక కామెంట్స్‌ చేశారు. తాను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్‌చేయడం అధికార పార్టీకి అలవాటుగా మారిందన్నారు. కీలకమైన విషయాలు చెప్పేటప్పుడు మైక్ కట్ చేయడంతోపాటు కెమెరాను కూడా తమవైపు తిప్పడం లేదని ఆరోపించారు. అధికార పార్ట నేతలు  స్పీకర్‌కు స్లిప్‌ పంపించడం వారు అనుమతి ఇవ్వడం జరిగిపోతుందన్నారు. అయినా తాను వెనక్కి తగ్గబోనని తన డ్యూటీ తాను చేస్తాన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని... దాన్ని సరి చేసి సాగు నీరు అందించామన్నారు హరీష్‌రావు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఇంజనీరింగ్ అధికారుల సలహాతోనే రీడైన్ చేశామన్నారు. తమ ప్రయత్నాలు కారణంగానే తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. తమ పాలనలో వలసలు తగ్గాయని... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఇక్కడ వచ్చి పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ఘటన తమ పార్టీకే చెందుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో కరవు కారణంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారని... జరిగిన అన్యాయంపై కవులు కళాకారులు గళమెత్తారని గుర్తు చేశారు. 

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు హరీష్‌ తీరుపై మండిపడ్డారు. ఆయన గ్లోబెల్స్‌ కంటే దారుణంగా అబద్దాలు చెబుతున్నరని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.... పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు కేంద్రానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదన్నారు. దీనిపై గతంలోనే ఆధారాలు ఇచ్చామన్నారు హరీష్‌ అయినా అవే అబద్దాలు పదే పదే చెబుతున్నారని హరీష్‌ ధ్వజమెత్తారు. గతంలో కాగ్‌ రిపోర్టులకు విలువలేదని కాంగ్రెస్ నాయకులు చెప్పారని ఇప్పుడు అదే కాగ్‌ రిపోర్టు ఇప్పుడు పరమ పవిత్రంగా భావిస్తున్నారని అన్నారు. ఇలా సభ జరుగుతున్నంత సేపు హరీష్‌ రావు ఒక్కడి ఒకవైపు మంత్రులు మరోవైపు హోరాహోరీగా సాగింది మాటల యుద్ధం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Embed widget