News
News
వీడియోలు ఆటలు
X

Viveka Murder Case Update: వివేక కేసులో గంగిరెడ్డికి బెయిల్ రద్దవుతుందా- అవినాష్‌ పిటిషన్ విచారణ ఏ తీరానికి?

Viveka Murder Case Update:వివేక హత్య కేసులో దర్యాప్తన  పూర్తి చేసేందుకు తుది గడువును సుప్రీంకోర్టు మరో రెండు నెలలు పెంచినప్పటికీ సీబీఐ దూకుడు మాత్రం తగ్గించ లేదు.

FOLLOW US: 
Share:

Viveka Murder Case Update:మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో నేడు కీలక పరిణామాలు జరిగే ఛాన్స్ ఉంది. మూడు ప్రధానమైన అంశాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి. ఓవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సాయంత్రం విచారణ జరగనుంది. మరోవైపు గంగిరెడ్డి బెయిల్‌పై తీర్పును ఇవాళ రానుంది. ఈ కేసులో మరో ఇద్దర్ని సీబీఐ రెండోసారి ప్రశ్నించనుంది. 

వివేక హత్య కేసులో దర్యాప్తన  పూర్తి చేసేందుకు తుది గడువును సుప్రీంకోర్టు మరో రెండు నెలలు పెంచినప్పటికీ సీబీఐ దూకుడు మాత్రం తగ్గించ లేదు. ఈ హత్య కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఇవాళ విచారణకు పిలిచింది. 

వివేక ముఖ్య అనుచరుడిగా ఉంటూనే కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన ఇనాయ్‌తుల్లాను సీబీఐ పిలిచింది. ఆయనతోపాటు ఉదయ్‌ కుమార్ రెడ్డి తండ్రి  ప్రకాష్ రెడ్డిని కూడా సీబీఐ కబురు పంపించింది. ఇప్పుడు ఇద్దరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనుంది సీబీఐ. ఇప్పటికే ఉదయ్‌ స్నేహితులు రాజు, చంద్రశేఖర్ రెడ్డిని సీబీఐ పిలిచి విచారించింది. వాళ్లతోపాటు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్లను కూడా సీబీఐ రికార్డ్ చేసింది.

ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం అవినాష్ రెడ్డి కొన్ని వారాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అది అనేకరాకలైన మలుపులు తిరిగి చివరకు తెలంగాణ హైకోర్టుకు వచ్చింది. మూడు రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ పిటిషన్ విచారణ ఈ సాయంత్రం 3.30కు జరగనుంది. మంగళవారమే దీన్ని విచారించాల్సి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టును నుంచి లిఖితపూర్వక ఆదేశాలు లాదేని బుధవారానికి వాయిదా పడింది. అయితే బుధవారం నాడు ఈ పిటిషన్ లిస్ట్ కానుందను గురువారానికి వాయిదా వేశారు. ఇవాళ 3.30 కి విచారణ చేపడతామని కోర్టు సమాచారం ఇచ్చింది. 

మరోవైపు ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దుపై కూడా కీలక తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది. ఆయన బెయిల్ పిటిషన్‌పై వాదనలు బుధవారమే పూర్తైనా తీర్పును గురువారానికి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. వివేక కేసులో గంగిరెడ్డి కీలకమైన వ్యక్తి అని ఆయన బెయిల్ రద్దు  చేయాలని సీబీఐ కోరుతోంది. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వాదించింది. అసలు హత్యకు కుట్ర చేసిందే ఆయనని వాదిస్తోంది. 

వివేక వద్ద డ్రైవర్‌గా పని చేసిన తాను హత్య చేయలేనని... 40 కోట్లు ఇస్తానంటూ దస్తగిరి వాంగ్మూలంలో చెప్పినట్టు సీబీఐ తెలిపింది. డీఫాల్డ్ బెయిల్‌ ను మెరిట్ ఆధారంగా రద్దు చేయాలని సునీత వాదించారు. 

అన్ని వర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో మరికాసేపట్లో తేలనుంది. ఇప్పటికే గంగిరెడ్డి బెయిల్ రద్దు విషయంలో చాలా కోర్టుల్లో సీబీఐకి ఎదురు దెబ్బ తగిలింది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి గంగిరెడ్డి తరఫున న్యాయవాదులు తీసుకెళ్లారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని చెప్పారు. 

అవినాష్ అరెస్టుపై ఎమ్మెల్యే సీరియస్ కామెంట్స్ 

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాక తకప్పదని ప్రొద్దుటూరు  ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.  ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని అనవసరంగా ఇరికించారని... అరెస్ట్ అయినా బెయిల్ పై వస్తారని ఆయన చెప్పుకొచ్చారు.  కడప  ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో  వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలతో  అవినాష్ రెడ్డి సమావేశం అయ్యారు.  ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌తో రెడ్డి పాటు కీలక నేతలు హాజర్యయారు.  అవినాష్‌ను సీబీఐ అరెస్ట్‌ చేస్తే రాజకీయంగా ఏం చేయాలన్నదానిపై చర్చించారు.  

Published at : 27 Apr 2023 10:35 AM (IST) Tags: Telangana High Court Gangi reddy Viveka Murder Case Avinash Reddy

సంబంధిత కథనాలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day:  ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?