News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Viral Video: ఫోన్ చూస్తూ తిప్పాడు, బొక్క బోర్లా పడ్డాడు - ఓ ఆటో డ్రైవర్ అత్యుత్సాహమిది!

Viral Video: హైదరాబాద్ లోని తీగల వంతెనపై ఆటో బోల్తా పడింది. ఫోన్ చూస్తూ.. డ్రైవర్ ఆటో నడపగా.. ముందు ఉన్న వాహనాన్ని తప్పించబోయాడు. కానీ అదుపుతప్పి బోల్తా కొట్టాడు. 

FOLLOW US: 
Share:

Viral Video: హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై ఓ ఆటో బోల్తా పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 22వ తేదీన జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతో వైరల్ గా మారాయి. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కొహినూర్ వైపు వెళ్తున్న ఆటో దుర్గం చెరువు తీగల వంతెనపై ఆకస్మాత్తుగా బోల్కతా కొట్టింది. డ్రైవర్ ఫోన్ చూస్తూ.. ఆటో నడిపాడు. ఈక్రమంలోనే ముందుగా వెళ్తున్న బైక్ ను తప్పించబోయాడు. కానీ అదుపుతప్పి బోల్తా కొట్టాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన ప్రయాణికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆటో బోల్తా కొట్టబోతున్నట్లు గుర్తించిన ప్రయాణికులు.. ముందుకు వేగంగా రాకపోవడంతో ఇతర ఏ వాహనాలు ప్రమాదానికి గురి కాలేవు. 

ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

భారత దేశంలో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. మనం కూడా వార్తల్లో వాటి గురించి వింటూనే ఉంటాం. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు

ఇది భారత దేశంలో చాలా తీవ్రమైన సమస్య. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినమైన చర్యలు తీసుకుంటూ, ఖరీదైన జరిమానాలు విధిస్తున్నా, వీటి కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలి.

డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడకూడదు

కారు అయినా, బైక్ అయినా చాలా మంది ఈ అజాగ్రత్తతో కనిపిస్తుంటారు. రైడర్ లేదా డ్రైవర్ దృష్టి రోడ్డుపైనే ఉండాలి. తద్వారా ప్రమాదం లాంటి పరిస్థితి తలెత్తదు. కాబట్టి దీన్ని కూడా అవాయిడ్ చేస్తే మంచిది.

హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడపకూడదు

భారత దేశంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం కూడా తీవ్రమైన తప్పు. హెల్మెట్ ఉపయోగించడం ద్వారా రోడ్డు ప్రమాదంలో ముఖ్యంగా తలకు గాయం అయినప్పుడు కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అయినప్పటికీ చాలా మంది బైక్ రైడర్లు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం చూడవచ్చు.

ఆకస్మిక లేన్ మారకూడదు

ద్విచక్ర వాహనం అయినా, నాలుగు చక్రాల వాహనమైనా అన్ని వాహనాల్లో సూచికలు ఉంటాయి. అయినప్పటికీ చాలా మంది వ్యక్తులు తమ కారును రోడ్డుపై నడుపుతున్నప్పుడు కుడి వైపు లేదా ఎడమ వైపు ఒకేసారి తిప్పుతారు. కొన్ని సార్లు ఎడమ వైపు నుంచి ముందు ఉన్న వాహనాన్ని ఓవర్‌ టెక్ చేస్తారు. ఇది కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది.

ఓవర్‌లోడింగ్ చేయకూడదు

చిన్న వ్యాపారం చేసే చాలా మంది వ్యక్తులు తమ బైక్ లేదా స్కూటర్ ద్వారా వస్తువులను తీసుకు వెళతారు. ఇందులో గ్యాస్ సిలిండర్లు, వాటర్ క్యాన్లు కూడా ఉంటాయి. ద్విచక్ర వాహనంపై అధిక లోడ్ కారణంగా దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది.

Published at : 24 Aug 2023 06:43 PM (IST) Tags: Hyderabad Viral News Telangana LAtest News Auto Boltha Auto Fall Down

ఇవి కూడా చూడండి

BRS News: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎంపీ

BRS News: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎంపీ

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు

PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ

PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ