అన్వేషించండి

Vijayashanthi: పంజాబ్‌ రాష్ట్రంలా తెలంగాణ మారుతోంది.. హైదరాబాద్‌లో మరీ ఎక్కువ.. విజయశాంతి సెటైర్లు

తెలంగాణలో గంజాయి దందా మూడు కిక్కులు, ఆరు దమ్ములు అన్న చందంగా ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు.

బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. ఇటీవల గంజాయి ఎక్కువగా పట్టుబడుతున్న వేళ.. ఆమె ఆ అంశంపై బుధవారం మాట్లాడారు. తెలంగాణలో గంజాయి వాడకం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో గంజాయి దందా మూడు కిక్కులు, ఆరు దమ్ములు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. గంజాయి వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం దానిపై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ మేరకు విజయశాంతి ట్విటర్, ఫేస్‌బుక్ వేదికగా ట్వీట్, పోస్టులు చేశారు.

‘‘రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గంజాయి దందా మూడు కిక్కులు, ఆరు దమ్ములు అన్న చందంగా మారింది. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రంలో గంజాయి దందా ఎలా జరిగిందో.. రాష్ట్రంలో ఇపుడు అదే జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇటీవల సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఒక చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ రాజు గురించి విచారించిన పోలీసులు.. అతనికి ఉన్న వ్యసనం గంజాయి అనీ.. ఆ మత్తులోనే కిరాతక ఘాతుకానికి పాల్పడ్డాడని.. పోలీసుల విచారణలో తేలిందంటే ప్రభుత్వం ఎంత నిద్ర మత్తులో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

అయితే, గంజాయి కేవలం సింగరేణి కాలనీకే పరిమితమయ్యిందా?... అంటే నమ్మడం అసాధ్యం. పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్న పిల్లలు మొదలు, పెద్దవారు, బడాబాబులు సైతం గంజాయికి బానిసలయ్యి మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు అందుకు నిదర్శనం. నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో సెలబ్రిటీలు, ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల మధ్యలోని బస్తీల్లో గంజాయి దందా జోరుగా సాగుతున్నా... పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బస్తీల్లోకి వెళ్లేందుకు కూడా పోలీసులు సాహసం చేయడం లేదంటే... ఎంత నెట్‌వర్క్‌తో గంజాయి దందా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. 

Also Read: గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

మరోవైపు నగరంలోని వివిధ పార్కుల్లో యువత సిగరెట్‌లోని పొగాకు తీసి, గంజాయి కుక్కి సేవిస్తూ మత్తులో ఊగుతున్నారంటే... తెలంగాణ యువత ఎంతటి దౌర్బాగ్య స్థితికి దిగజారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా.... చీకటి ముసుగులో నగర గల్లీగల్లీలో యువత గంజాయికి ఎంతగా ప్రభావితులు అవుతున్నారో ఆ దేవుడికే తెలియాలి. యువత ఇంతలా చెడిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు ఉండడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి గంజాయి మత్తు నుంచి యువతరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే మంచిది.’’ అని విజయశాంతి తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేశారు.

Also Read: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇక బస్సులు అలా కనిపించవు

Also Read: Hyderabad: భర్తను కిడ్నాప్ చేయించిన భార్య.. కారణం తెలిసి పోలీసులు షాక్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
Embed widget