Vande Bharat Express Train: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ట్రైన్ ప్రారంభించిన మోదీ- రేపటి నుంచి రెగ్యులర్ సర్వీస్‌లు
Vande Bharat Express Train: సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Vande Bharat Express Train: సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 11.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీ నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ పచ్చజెండా ఊపి వందేభారత్‌ను ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రెండో వందేభారత్ ట్రైన్. ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్ మధ్య వందేభారత్ నడుస్తోంది.
ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించారు. అంతకు ముందు విద్యార్థులతో ముచ్చటించారు.
PM Narendra Modi flags off Secunderabad-Tirupati Vande Bharat Express train in Hyderabad
— Press Trust of India (@PTI_News) April 8, 2023
ఈ ట్రైన్ 130 కిలోమీటర్ల వేగంతో సికింద్రాబాద్ గూడూరు మధ్య ప్రయాణించనుంది. తెనాలి, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది.
సికింద్రాబాద్, తిరుపతి మధ్య 661 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ దూరాన్ని వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకుకుంటుంది. ప్రయాణికులు ఈ ట్రైన్ ఎక్కేందుకు స్లైడింగ్ ఫుట్‌స్టెప్‌లను, ఆటోమెటిక్ ప్లగ్ డోర్‌లను అమర్చారు. కోచ్‌ల మధ్య టచ్‌ఫ్రీ స్లైడింగ్ డోర్‌లను అమర్చారు. దివ్యాంగుల కోసం ప్రకత్యేకంగా డిజైన్ చేసిన వాష్‌రూంలు సికింద్రాబాద్, తిరుపతి వందేభారత్ ట్రైన్‌లో ఉన్నాయి.
ఇవాళే ప్రదానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న సికింద్రాబాద్, తిరుపతి వందేభారత్ బుకింగ్స్ ఈ ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేపటి (ఆదివారం) నుంచి రైల్వే శాఖ రెగ్యులర్ సర్వీస్‌లు నడపనుంది. ఈ ట్రైన్ ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనుంది. మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల మధ్య తిరుపతి చేరుకుటుంది. అక్కడ 3.15కి బయల్దేరి రాత్రి 11.30 నుంచి పన్నెండు గంటల మధ్య సికింద్రాబాద్ చేరుకుంటుంది. విశాఖ- సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్‌కు ఆదివారం సెలవు అయితే... తిరుపతి- సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్‌కు మంగళవారం సెలవు దినంగా ప్రకటించారు.
టికెట్ రేట్లు పరిశీలిస్తే... సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఏసీ చైర్‌కార్‌కు 1680 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర 3080 రూపాయలు. తిరుపతి నుంచి సికింద్రబాద్ వచ్చే ట్రైన్‌లో ఏసీ చైర్‌కార్ ఖరీదు 1625 రూపాయలు ఉంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కు 3030 రూపాయలు వసూలు చేయనున్నారు. ఇందులో బేస్‌ప్రైస్ 1168 ఉంటే... రిజర్వేషన్ ఛార్జి 40రపాయలు ఉంది. సూపర్ ఫాస్ట్ ఛార్జి 45 రూపాయలు, ఈ టికెట్‌పై జీఎస్టీ63రూపాయలు ట్రైన్‌లో ఫుడ్ కావాలంటే మాత్రం 364 రూపాయలు ఛార్జ్ చేస్తారు.