అన్వేషించండి

Kishan Reddy: బీజేపీలోకి చిరంజీవి కన్ఫామ్‌గా వస్తారు, ఈటలకు ఆ రూల్ వర్తించదు: కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Chiranjeevi Politics | తాను పిలిస్తే చిరంజీవి బీజేపీలోకి కన్ఫామ్‌గా వస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

Telangana Politics : హైదరాబాద్: తెలంగాణలో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ఆదివారం చిట్ చాట్ లో కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పిలిస్తే టాలీవుడ్ నటుడు చిరంజీవి కచ్చితంగా బిజెపిలో చేరతారని తన మనసులో మాట బయటపెట్టారు. సినీ ఇండస్ట్రీలో పలువురితో బిజెపికి సత్సంబంధాలు ఉన్నా యని.. కొందరు తమ పార్టీలో చేరి కేంద్ర మంత్రులు సైతం అయ్యారని గుర్తు చేశారు. మరికొందరు పార్టీలో చేరి విమర్శలు చేసి వెళ్లిపోయారని చెప్పారు.

ఒంటరిగానే బరిలోకి బీజేపీ
బిజెపి, కాంగ్రెస్ ఒకటేనని ఎవడో పనికిమాలిన వాడు చేసిన వ్యాఖ్యలకు నేను సమాధానం చెప్పాలా అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు బిజెపి ఎప్పుడు వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇస్తున్న నిధులను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామన్నారు. 

ఈటలకు ఆ నిబంధన వర్తించదు..
టిఆర్ఎస్ లో తర్వాత అధ్యక్షుడు ఎవరో అందరికీ తెలుసు. ఆ పార్టీలో డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు జరుగుతాయి. బిజెపిలో అలాంటి పరిస్థితి ఎన్నటికీ ఉండదు. బిజెపిలో బీసీలకు ప్రాధాన్యం కల్పించాము. 50 శాతం బిజెపి మండల అధ్యక్షులుగా బీసీలు ఉన్నారు. స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక మరోసారి ప్రజల్లోకి వెళతాం. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టాలంటే రెండుసార్లు క్రియాశీల సభ్యుడు అయి ఉండాలి. కానీ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ కు ఆ నిబంధన వర్తించదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

తెలంగాణకు బీజేపీ ఏం చేసిందంటే..
రాష్ట్ర ఆదాయం దృష్టిలో ఉంచుకొని పథకాలు అమలు చేయాలని, ఉచితలకు బిజెపి ఎప్పుడు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో పసుపు బోర్డు, జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్, వరంగల్ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చింది తామే అన్నారు. ఏపీ రాజధాని అమరావతికి సైతం విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్రం నిధులు అందించి సహకరిస్తుందన్నారు. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జాతీయ నేతగా ఎదగాలని చూస్తున్నారు. కానీ తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో కలిసి పనిచేసే పార్టీ ఎంఐఎం అని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. అసదుద్దీన్ తీరు నచ్చక ముస్లిం నేతలు ఆయనను పిట్టలదొర అని అంటారని తెలిపారు. తమ వల్లే రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్ చెబితే ఈడ్చి తన్నాలి. తెలంగాణ కోసం ఎంతో చేసిన పార్టీ తమదేనని, కేంద్రం నిధులు ఇచ్చి సహకరిస్తుందని తెలిపారు.

చిరంజీవి సోదరుడు, పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తున్నారు. జనసేన అధినేత ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. దక్షిణాది బీజేపీ రాజకీయాలకు వీలుచిక్కినప్పుడల్లా తన వంతు సహకారం అందిస్తున్నారు. కిషన్ రెడ్డి అన్నట్లుగా నిజంగానే చిరంజీవి బీజేపీలో చేరతారా అనే చర్చ మొదలైంది. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి లక్ పరీక్షించుకున్నారు. అది బెడిసి కొట్టడంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్యసభకు పంపించడంతో పాటు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయాల నుంచి వైదొలిగిన చిరంజీవి మళ్లీ అటువైపు రానని గతంలోనే స్పష్టం చేశారు. సినిమాలే తనకు జీవితమన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Family Register: ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget