News
News
X

Kishan Reddy Nephew: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేనల్లుడు హఠాన్మరణం, ఇంట్లోనే కుప్పకూలిన జీవన్ రెడ్డి

సైదాబాద్‌లోని వినయ్‌ నగర్‌ కాలనీలో జీవన్‌ రెడ్డి నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.

FOLLOW US: 
Share:

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మేనల్లుడు జీవన్‌ రెడ్డి గురువారం (ఫిబ్రవరి 23) హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 51 సంవత్సరాలు. ఆయనకు గుండెపోటు కారణంగా మృతి చెందారు. సైదాబాద్‌లోని వినయ్‌ నగర్‌ కాలనీలో జీవన్‌ రెడ్డి నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను కంచన్‌ బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. జీవన్‌ రెడ్డికి భార్య ఉమా, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిషన్‌ రెడ్డి పెద్ద అక్క లక్ష్మీ-నర్సింహా రెడ్డి దంపతుల కుమారుడు జీవన్‌ రెడ్డి. ఈయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం. జీవన్‌ రెడ్డి చనిపోయిన విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కానిస్టేబుల్‌‌కు కూడా ఇదే పరిస్థితి

నిన్న ఒక్కరోజే హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు మూడు జరిగాయి. కిషన్ రెడ్డి మేనల్లుడి మరణంతో పాటు, జిమ్ లో ఓ కానిస్టేబుల్, పెళ్లిలో కన్యాదానం చేస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలి చనిపోయారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ 24 ఏళ్ల యువ పోలీస్‌ కానిస్టేబుల్ గుండె పోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. బోయిన్‌పల్లికి చెందిన ఈ కానిస్టేబుల్ పేరు విశాల్. 2020 బ్యాచ్‌ కానిస్టేబుల్స్ శిక్షణలో పాల్గొన్నాడు. ఆసిఫ్‌ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. చదువు పూర్తయిన వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడిన ఈ యువకుడు 24 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను తీవ్రమైన విషాదంలో ముంచింది.

పెళ్లి కుమార్తె తండ్రి కూడా

పాత బస్తీలోని కాలాపత్తార్‌లో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల తమ బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బంధువులంతా ఉత్సాహంగా పాల్గొని వరుడిని ముస్తాబు చేస్తున్నారు. ఇంతలో మహమ్మద్ రబ్బాని పెళ్లి కొడుకు వద్దకు వచ్చి.. అతడి పాదాలకు పసుపు రాస్తుండగా ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన బంధువులు అయన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఆయన చనిపోయారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించారు. 

రబ్బాని మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహమ్మద్ రబ్బాని వరుడి పాదాలకు పసుపు రాస్తూ కుప్పకూలిన దృశ్యాలను బంధువులు ఫొన్‌లో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీటిని చూసిన వారు భయానికి గురవుతున్నారు.

సీపీఆర్ చేసి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఓ వ్యక్తి ప్రాణాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న బాలాజీ అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఎల్బీ నగర్ నుంచి బాలాజీ అనే వ్యక్తి ఆరంఘర్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఆరంఘర్ చౌరస్తాలో దిగగానే బాలాజీ గుండెపోటుతో కుప్పకూలాడు. గమనించి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ వెంటనే సీపీఆర్ చేశారు. ఛాతీపై గట్టిగా పదే పదే ప్రెస్ చేసి బాలాజీ ప్రాణాన్ని రాజశేఖర్ కాపాడారు. అనంతరం బాలాజీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Published at : 24 Feb 2023 09:28 AM (IST) Tags: Kishan Reddy Heart Attack Saidabad Union Minister Kishan Reddy Kishan Reddy nephew

సంబంధిత కథనాలు

Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం

Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Ambedkar Statue: 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ పనులు వేగవంతం, ఏప్రిల్ 10 డెడ్ లైన్

Ambedkar Statue: 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ పనులు వేగవంతం, ఏప్రిల్ 10 డెడ్ లైన్

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే  నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది