TSRTC Ticket Rates: నేటి నుంచే TSRTC బస్ టికెట్ రేట్ల పెంపు, మీ రూట్‌లో ఎంత పెరిగిందో చూడండి
ఈ సెస్ పెంపు వల్ల ప్రయాణించాల్సిన కిలో మీటర్లు పెరిగితే ఛార్జీలు పెరుగుతాయి. లాంగ్ జర్నీలు చేసేవారికి మరింత భారం అవ్వనుంది.
TSRTC Bus Ticket Rates Hike: తెలంగాణ ఆర్టీసీ మరోసారి బస్సు ఛార్జీల రేట్లను పెంచుతోంది. డీజిల్ సెస్ పేరుతో ఈ వాయింపు ఉండనుంది. కిలో మీటరు లెక్కన దాదాపు అన్ని రకాల బస్సుల్లో ఛార్జీలు పెరగనున్నాయి. అయితే, హైదరాబాద్ లో మాత్రం సిటీ బస్సులకు దీన్ని ప్రస్తుతానికి మినహాయించారు. ఈ పెంపు ఇప్పటికే నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గత మార్చిలోనే డీజీల్ సెస్ పేరుతో దాదాపు రూ.2 నుంచి రూ.5 వరకూ ధర పెంచారు. ఇప్పుడు కిలో మీటర్ల ప్రాతిపదికన డీజిల్ సెస్ ను పెంచుతున్నారు. ఈ పెంపుతో సగటున ఒక్కో ప్యాసింజర్ పైన రూ.20 వరకూ భారం పడనుంది.
ఈ సెస్ పెంపు వల్ల ప్రయాణించాల్సిన కిలో మీటర్లు పెరిగితే ఛార్జీలు పెరుగుతాయి. లాంగ్ జర్నీలు చేసేవారికి మరింత భారం అవ్వనుంది.
ఛార్జీల పెంపు ఇలా..
ఏసీ బస్సుల్లో 500 కిలో మీటర్ల పరిధిలో రూ.10 నుంచి రూ.170 పెరుగుదల
సూపర్ లగ్జరీ బస్సుల్లో 500 కిలో మీటర్ల పరిధిలో రూ.10 నుంచి రూ.130 పెరుగుదల
ఎక్స్ ప్రెస్ బస్సులో 500 కిలో మీటర్ల పరిధిలో కనిష్ఠంగా రూ.5 నుంచి రూ.90 పెరుగుదల
పల్లె వెలుగు బస్సులో 250 కిలో మీటర్లకు కనిష్ఠంగా రూ.5, గరిష్ఠంగా రూ.45 పెరిగింది
మార్గం ఎక్స్ ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ రాజధాని
హైదరాబాద్ - వరంగల్ రూ.25 రూ.30 రూ.30 రూ.40
హైదరాబాద్ - కరీంనగర్ రూ.30 రూ.35 రూ.40 రూ.50
హైదరాబాద్ - విజయవాడ రూ.45 రూ.50 రూ.60 రూ.70
హైదరాబాద్ - బెంగళూరు - - రూ.145 రూ.190