TSRTC News: బస్సు ఎక్కాలంటే చిల్లర కోసం చింతా, ఇకపై ఆ సమస్య ఉండదు - సిటీ బస్సుల్లో యూపీఐ సేవలు
TSRTC News: బస్సు ఎక్కాలంటే చిల్లర కోసం చాలా మంది తెగ టెన్షన్ పడిపోతుంటారు. కానీ ఈ సమస్యకు టీఎస్ఆర్టీసీ చెక్ పెట్టబోతోంది. సిటీ బస్సుల్లో యూపీఐ సేవలను వినియోగంలోకి చేబోతుంది.
TSRTC News: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులగు గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు ఎక్కాలంటే చిల్లర కోసం టెన్షన్ పడే వాళ్ల సమస్యలకు చెక్ పెట్టబోతుంది. ఇకపై నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. దీని వల్ల ప్రయాణికులతో పాటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుందని.. పైగా సిటీ బస్సుల్లో చిల్లర సమస్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే నగరంలో ఉన్న 2,500కు పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియ ఉంది. అయితే ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన జిల్లా సర్వీసు.. అంటే మెట్రో లగ్జరీ, ఏసీ బస్సుల్లో యూపీఐ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అలాగే నగరంలోని ఎయిర్ పోర్టుకు తిరిగే ఏసీ బస్సుల్లోనూ క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ జారీ చేస్తున్నారు. తాజాగా సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం అన్ని బస్సుల్లో ఐ-టీమ్స్ యంత్రాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే ఐ టీమ్స్ యంత్రాలను పంపిణీ చేసే సంస్థతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు ఆర్టీసీ గ్రేడర్ జోన్ అధికారులు వెల్లడించారు. అనంతరం కంటోన్మెంట్ డిపోలో అమలు చేశాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా ప్రవేశ పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునే టప్పుడు చిల్లర సమస్యతో కండక్టర్లు, ప్రయాణికుల అనేక సమస్యలు వస్తుంటాయి. చిల్లర ఇవ్వమని కండక్టర్, లేవని ప్రయాణికులు గొడవలు పడిన సంఘటనలు కోకొల్లలు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి యాజమాన్య బట్ టికెట్లను రౌండ్ ఫిగర్లుగా మార్చింది. రూ.10, 15, 20, 25.. ఇలా రౌండ్ ఫిగర్ చేసేసింది. అయినప్పటికీ సమస్యలకు చెక్ పడలేదు. దీంతో దూర ప్రాంత, అధిక ఛార్జీలు ఉండే 700 బస్సుల్లో (సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో) ఐ-టిమ్స్ ను ప్రవేశ పెట్టారు. మిగిలిన 8 వేల 300 బస్సుల్లో సాధారణ టిమ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటిల్లో కూడా నగదు రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చి.. ఇటు ఉద్యోగులతో పాటు ప్రయాణికుల సమస్యలను తీర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి 29వ తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది.