Sajjanar News: సజ్జనార్ వార్నింగ్! మహిళా కండక్టర్‌ను కాలుతో తన్నడంపై స్పందన
Hyderabad News: సిబ్బంది విధులకు ఆటకం కలిగించాలని లేదా దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సజ్జనార్ హెచ్చరించారు.

VC Sajjanar Warning: డ్యూటీలో ఉన్న ఓ మహిళా కండక్టర్‌ను ప్రయాణికురాలు కాలితో తన్నిన ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. ఈ ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోందని సజ్జనార్ అన్నారు. మహిళా కండక్టర్ తన వద్ద చిల్లర లేదని చెప్పినప్పటికీ ప్రయాణికురాలు ఏ మాత్రం వినలేదని అన్నారు. నిబద్దతతో సమర్థంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే తాము అస్సలు ఉపేక్షించబోమని సజ్జనార్ స్పష్టం చేశారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారని.. వారి విధులకు ఆటకం కలిగించాలని లేదా దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.
‘‘హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మొదటి ట్రిప్పుని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించిన ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది’’ అని సజ్జనార్ పోస్ట్ చేశారు.
హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 31, 2024
#ObjectionableLanguage#FoulLanguage#AbusiveLanguage
— Saye Sekhar Angara (@sayesekhar) January 31, 2024
A woman passenger used filthiest language against a City Bus conductor on Hayathnagar Afzalgunj route No.72 bus belonging to Hayathnagar-1 depot. Despite other passengers trying to mollify her, she went on hurling invectives… pic.twitter.com/k8iZ6CsAOi
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

