అన్వేషించండి

TSRTC News: కండక్టర్ ఫ్యామిలీకి ఆర్టీసీ రూ.50 లక్షల సాయం - చెక్కు అందించిన సజ్జనార్

ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్‌ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తాజాగా ఆయన కుటుంబానికి రూ.50 లక్షలు అందింది.

రోడ్డు ప్ర‌మాదంతో విషాదం అలుముకున్న ఉద్యోగి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. అకాల మృత్యువు వెంటాడిన కండక్టర్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్‌ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జ‌గిత్యాల నుంచి వ‌రంగ‌ల్ వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ బ‌స్సును రాంగ్ రూట్‌లో వ‌చ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మ‌ల్యాల - బ‌ల‌వంతాపూర్ స్టేజీ వ‌ద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండ‌క్టర్ కుటుంబంలో విషాదం అలుముకుంది.

ఈ ఆప‌ద స‌మ‌యంలో యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు బాధిత కుటుంబానికి అక్కర‌కొచ్చింది. సిబ్బంది, ఉద్యోగుల సాల‌రీ అకౌంట్స్‌ను ఇటీవ‌ల యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చింది. ఆర్థిక ప్రయోజ‌నంతో కూడిన సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్‌, రూపే కార్డు తీసుకోవాల‌ని ప్రత్యేక మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. సంస్థ‌లోని ఉద్యోగులంద‌రూ వారు నివ‌సిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. 

ఈ ఖాతా, కార్డు ద్వారా ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఉండ‌టంతో ఉద్యోగుల‌కు ఎంతో ఆర్థిక ప్ర‌యోజ‌నం చేకూరుతోంది. ప్ర‌మాదాలు జ‌రిగిన స‌మ‌యంలో సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేత‌నం ప్ర‌కారం) క‌నీసం రూ.40 ల‌క్ష‌లు, రూపే కార్డు కింద మ‌రో రూ.10 ల‌క్ష‌లను యూబీఐ అందజేస్తోంది.

ఈ మేర‌కు రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన జ‌గిత్యాల డిపో కండక్ట‌ర్ బొల్లం స‌త్త‌య్య కుటుంబానికి రూ.50 లక్షల విలువైన 2 చెక్కుల‌ను యూబీఐ అధికారులతో కలిసి సంస్థ  ఎండీ వీసీ సజ్జనార్‌, ఐపీఎస్‌ మంగ‌ళ‌వారం బ‌స్‌ భ‌వ‌న్‌లో అంద‌జేశారు. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండ‌క్ట‌ర్ సత్తయ్య భార్య బొల్లం పుష్ఫ‌తో పాటు కొడుకు ప్ర‌వీణ్ కుమార్‌, కూతురు మాధ‌వీల‌త‌ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. 

చెక్కులను అంద‌జేసిన అనంత‌రం సజ్జనార్‌ మాట్లాడుతూ.. త‌న త‌ప్పు ఏమీ లేక‌పోయినా రోడ్డు ప్ర‌మాదంలో సత్తయ్య అకాల మ‌ర‌ణం చెంద‌టం దుర‌దృష్ట‌క‌ర‌మని అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక‌ ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్లు గుర్తు చేశారు. పోష‌ణ‌లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ స‌భ్యుల‌కు సంస్థ అండ‌గా నిలుస్తుంద‌ని,  ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఎంతో ఉప‌క‌రిస్తుంద‌న్నారు. 

ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌తో కూడిన సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ గా ఉద్యోగుల ఖాతాల‌ను యాజమాన్యం మార్చ‌డం జ‌రిగిందని చెప్పారు. సంస్థలోని ప్రతి ఉద్యోగి సూపర్‌ సాలరీ సేవింగ్‌ అకౌంట్‌కు ఖాతాను మార్చుకోవాలని సూచించారు. కొన్ని ప‌థ‌కాలు ఆప‌ద స‌మ‌యంలో అక్క‌ర‌కు వ‌స్తాయ‌ని, ఇందుకు ఇదే ఉదాహ‌ర‌ణ అని, వాటిని వినియోగించుకోవ‌డంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అల‌స‌త్వం వ‌హించ‌కూడ‌ద‌ని సూచించారు. ఈ అవ‌కాశాన్ని క‌ల్పించిన యూబీఐకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా సంస్థ సీవోవో డాక్టర్‌ వి.రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఈడీలు ఎస్‌. కృష్ణకాంత్‌, వినోద్‌ కుమార్‌, యూబీఐ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పి.క్రిష్ణణ్‌, రీజిన‌ల్ హెడ్ డి.అప‌ర్ణ రెడ్డి, డిప్యూటీ రీజిన‌ల్ హెడ్ జి.వి.ముర‌ళీ కృష్ణ, తదిత‌ర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోనికి నెలకు రూ.1000 - ప్రభుత్వ పథకం కింద అకౌంట్లోకి డబ్బులు, అధికారులు షాక్
బాలీవుడ్ నటి సన్నీలియోనికి నెలకు రూ.1000 - ప్రభుత్వ పథకం కింద అకౌంట్లోకి డబ్బులు, అధికారులు షాక్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
Year Ender 2024: హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌
హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌
Embed widget