అన్వేషించండి

Double Bedroom House: వారికి త్వరలోనే డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

TS Minister Vemula Prashanth Reddy: 2,28,529 గృహాలకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

అర్హులైన వారికి త్వరలోనే డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 
- డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వివరాలపై మంత్రి వేముల సమీక్ష
- పేదల సొంతింటి కల నిజం చేయడమే కేసిఆర్ ప్రభుత్వ ధ్యేయం
- నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్లకు మౌళిక సదుపాయాలు వెంటనే పూర్తి చేయాలి
- ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల ప్రకారం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తాం
- అర్హులైన వారికి ఇండ్లు అందించేందుకు ఏర్పాట్లు చేయాలి
- హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Double Bedroom Housing scheme: హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, పేదల సొంతింటి కలను నెరవేర్చే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ ప్రగతి, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వివరాలపై బుధవారం నాడు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు పడకల గృహ నిర్మాణ పథకంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,91,057 ఇండ్లు రూ.19,328.32 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో మంజూరీ చేయగా.. 2,28,529 గృహాలకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు.

ఇప్పటికే 1,29,528 గృహాల నిర్మాణం పూర్తి 
నిర్మాణం ప్రారంభించిన 2,28,529 డబుల్ బెడ్రూం ఇండ్లకు గాను 1,29,528 గృహాలు ఇప్పటికే పూర్తి అయ్యాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మిగతా 58,350  గృహాల నిర్మాణం తుది దశలో ఉన్నదని వెల్లడించారు. మిగతా  40,651 డబుల్ బెడ్రూం ఇండ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. నిర్మాణం పూర్తి అయినా, నిర్మాణము తుది దశలో ఇండ్లకు మౌలిక సదుపాయాలు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని మంత్రి వేముల అధికారులను ఆదేశించారు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల ప్రకారం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా త్వరగా పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులకు ఇండ్లు అందజేసెందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

పేదల సొంతింటి కల నిజం చేయడమే కేసిఆర్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.11,614.95 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget