By: ABP Desam | Updated at : 04 Aug 2023 11:04 PM (IST)
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Telangana Minister Srinivas Goud: తెలంగాణకు పర్యాటకులను విశేషంగా ఆకర్షించటానికి మలేసియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, థాయిలాండ్ లాంటి దేశాల్లో తెలంగాణ టూరిజం డిజిటల్ ఫెయిర్, ఫిజికల్, రోడ్ షో లు, ట్రావెల్స్ త్రాడెక్స్, ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్ టూరిజం ప్రమోషన్ ను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా ప్రమోషన్ చేయడానికి ప్లాన్ తయారుచేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాదులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలోనీ తన కార్యాలయంలో సింగపూర్ కు చెందిన టూరిజం ప్రమోషనల్ డిజిటల్ మార్కెటింగ్ కు చెందిన ప్రముఖ సంస్థ యూనిక్యూ ప్రతినిధుల బృందంతో శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలకు Asia Pacific దేశాలైనా మలేసియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, థాయిలాండ్ లాంటి దేశాల్లో తెలంగాణ టూరిజం డిజిటల్ ఫెయిర్, ఫిజికల్, రోడ్ షో లు, ట్రావెల్స్ త్రాడెక్స్, ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్ టూరిజం ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించటానికి మంత్రి చర్చించారు.
అనంతరం మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తించబడిన టూరిజం ప్రాంతాలు ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం (Ramappa Temple), అద్భుతమైన జలపాతాలు, సుందరమైన నదీ ప్రాంతాలు, ECO URBAN PARK లు, అటవీ ప్రాంతాలు, ప్రాచీన కట్టడాలు, కోటలు, చారిత్రక సంపద, పురావస్తు, వారసత్వ సంపద, ఆధునిక జీవనశైలికి తెలంగాణ రాష్ట్రం గుర్తింపునకు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ దేశాలలో టూరిజం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. సింగపూర్ దేశానికి చెందిన డిజిటల్ మార్కెటింగ్ సంస్థ యూనిక్యూ తెలంగాణ టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. తెలంగాణకి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అన్నారు.
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
/body>