By: ABP Desam, Shankar Dukanam | Updated at : 23 Apr 2023 10:19 PM (IST)
కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ మంత్రి కేటీఆర్
KTR Satires On Amit Shah: హైదరాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా చేవెళ్లలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కేంద్రం నుంచి బీజేపీ పెద్దగా హోం మంత్రి అమిత్ షా చేవెళ్ల సభకు హాజరయ్యారు. అయితే రాష్ట్రానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వచ్చిన సందర్భంగా వారిపై విమర్శలు, ప్రశ్నాస్త్రాలు సంధించడం బీఆర్ఎస్ నేతలకు ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కు అలవాటేనని తెలిసిందే. తాజాగా అమిత్ షా తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి త్వరలో తొమ్మిదేళ్లు పూర్తి కానుంది. అయితే ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ‘ఐటీఐఆర్ హైదరాబాద్ మంజూరు చేశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేశారు. ఐఐఎం, ఐఐఎస్‌ఆర్, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్‌ఐడీ, నవోదయాలు, మెడికల్, నర్సింగ్ కాలేజీలకు శంకుస్థాపన చేసినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. జస్ట్ వెయిట్.. పైన తెలిపిన వాటిలో ఏవీ కేంద్రం చేయలేదంటూ తనదైన శైలిలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.
I thank HM @AmitShah Ji on laying the foundation for
— KTR (@KTRBRS) April 23, 2023
☑️ ITIR Hyderabad
☑️ National Project status for Palamuru - RR lift irrigation project
☑️ Hyderabad Metro Phase 2
☑️ IIM, IISER, IIIT, IIT, NID, Navodayas, Medical & Nursing Colleges
Oh Wait 😁 he did none of that.
Amit…
ఈ 9 ఏళ్ల కాలంలో తెలంగాణ కంటే మెరుగైన స్థానంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాన్ని ఒక్కటైనా చూపగలరా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణను కేంద్రం చిన్న చూపు చూస్తోందని, రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రతిష్టాత్మక కాలేజీలు, ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వలేదని కేటీఆర్, సీఎం కేసీఆర్ పదే పదే విమర్శి్స్తున్నారు. గుజరాత్ కు, యూపీకి ఇచ్చే ప్రాజెక్టులు, నిధులలలో సగం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు, మంత్రులు పలుమార్లు ఆరోపించారు.
There is a massive wave of support for PM @narendramodi Ji in Telangana.
— Amit Shah (@AmitShah) April 23, 2023
People are fed up with the corruption and dynasticism of the BRS government and want a double-engine government led by Modi Ji.
Visuals from today's rally at Chevella (Telangana). pic.twitter.com/NrwNhnDqSd
ప్రధాని సీటు ఖాళీ లేదు కేసీఆర్
సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, అయితే ప్రధాని సీటు ఖాళీగా లేదని అమిత్ షా స్పష్టం చేశారు. చేవెళ్ల సభలో అమిత్ షా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని అని వెల్లడించారు. కేసీఆర్ ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలంటూ సెటైర్లు వేశారు. ప్రధాని మోదీని ప్రజల నుంచి సీఎం కేసీఆర్ దూరం చేయలేరన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో దేశమంతా విస్తరించాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. మజ్లీస్ చేతుల్లో కారు స్టీరింగ్ ఉందన్నారు. మజ్లిస్‌కు బీజేపీ భయపడేది లేదని స్పష్టం చేశారు. మజ్లిస్‌కు భయపడే బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించట్లేదన్నారు.
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు
TS ICET: జూన్ 4న తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!
TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!
Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12