అన్వేషించండి

KTR Mumbai Tour: ముంబైలో పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి

KTR Visits Mumbai: ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్, జిందాల్ గ్రూప్ ఎండి, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఎండీతో సమావేశం అయ్యారు.

KTR Visits Mumbai - టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ తో కేటీఆర్ సమావేశం
- జిందాల్ గ్రూప్ ఎండి సజ్జన్ జిందాల్ ను కలిసిన కేటీఆర్ 
- హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఎండీతోనూ సమావేశం

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ముంబైలో పర్యటిస్తున్నారు. ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ తో టాటా కార్పొరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్ లో మంత్రి కేటీఆర్ సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల పైన చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. టాటా గ్రూపు వివిధ రంగాల్లో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రశేఖరన్ ను కేటీఆర్ కోరారు. 
వరంగల్ కు టిసిఎస్ కార్యకలాపాల విస్తరించాలని కోరిన కేటీఆర్
ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని తెలిపిన కేటీఆర్, టిసిఎస్ కార్యకలాపాలను వరంగల్ కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ప్రణాళికలతో టాటా గ్రూప్ ముందుకు పోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించిన కేటీఆర్, ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్న నేపథ్యంలో... హైదరాబాదులో ఒక ఎమ్మార్వో Maintenance, Repair, and Overhaul (MRO) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. 

KTR Mumbai Tour: ముంబైలో పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి

తెలంగాణలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువు: టాటా చైర్మన్
తెలంగాణలోన వివిధ రంగాల్లో తమ సంస్థ పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని తెలిపిన టాటా చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, రాష్ట్రంలో తమ కార్యకలాపాలు కొనసాగుతున్న తీరుపట్ల అత్యంత సంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువుగా ఉంటుందని తమ సంస్థ అనుభవం నిరూపించిందన్న చంద్రశేఖరన్, భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో కచ్చితంగా తెలంగాణకు కీలకమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశ ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య పరిస్థితులు, వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాల వంటి అనేక ఇతర అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి.

పెట్టుబడులు పెట్టాలని జేయస్‌డబ్ల్యూ ఎండీని కోరిన మంత్రి
మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ జేయస్‌డబ్ల్యూ JSW మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అపార విజయవంతమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జిందాల్ ని కేటీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సేయిల్ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. బయ్యారంతో పాటు పక్కనే ఉన్న చత్తీస్ ఘడ్ లో ఉన్న ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని కేటీఆర్ వివరించారు. 

జేయస్‌డబ్ల్యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే, అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. జిందాల్ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విద్య, క్రీడారంగం వంటి ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిందాల్ ని కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం పాలసీల గురించి తమకు అవగాహన ఉన్నదన్న సజ్జన్ జిందాల్, కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి, పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. 

KTR Mumbai Tour: ముంబైలో పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి

హిందుస్థాన్ యూనిలీవర్ ఎండీతో కేటీఆర్ భేటీ
అనంతరం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమైన కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో fmcg రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవకాశమని కేటీఆర్ తెలిపారు. ఈ రంగంలో ఇతర సంస్థలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. 

పామ్ ఆయిల్ ఉత్పత్తి కోసం ఒక బృహత్తర లక్ష్యాన్ని ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహిస్తోందని తెలిపారు. వంట నూనెల ఉత్పత్తి కోసం హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమన్నారు కేటీఆర్.  ఆ తరువాత ఆర్ పి జి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయంకా తోనూ మంత్రి కేటీఆర్ సమావేశమై, పెట్టుబడులు, రాష్ట్ర ప్రగతిపై చర్చించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Sabarimala News: శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
Telangana Congress Bombs : తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: చంద్రబాబుకు ముద్దు పెట్టాలని మహిళ ఉత్సాహంParvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP DesamKappatralla Uranium News | రోడ్డుపై బైఠాయించిన కప్పట్రాళ్ల గ్రామస్థులు | ABP DesamHamas Leader Killed In Israel Attack | హమాస్ కీలక నేతను మట్టుబెట్టిన ఇజ్రాయేల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Sabarimala News: శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
Telangana Congress Bombs : తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
Rains in AP, Telangana: ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు, IMD ఎల్లో అలర్ట్
ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు, IMD ఎల్లో అలర్ట్
CM Chandrababu: 'రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక' - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
'రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక' - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Embed widget