By: ABP Desam | Updated at : 27 Apr 2022 11:05 AM (IST)
కేటీఆర్, టీఆర్ఎస్ ప్లీనరీ, టీఆర్ఎస్, మంత్రి కేటీఆర్
TRS Plenary All Set to Plenary Party Invited 3000 People: టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నేడు ప్లీనరీ నిర్వహిస్తున్నారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీని స్థాపించారు. అనుకున్నట్లుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే పలు రంగాల్లో కొత్త రాష్ట్రాన్ని ముందంజలో నిలిపారు. నేడు దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ జాతీయ పార్టీలకు దీటుగా ఎదుగుతోంది. నేడు 13 వరకు తీర్మానాలను టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధమైంది. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో ఎటుచూసినా గూలాబీమయంగా కనిపిస్తోంది.
టీఆర్ఎస్ ప్లీనరీకి దాదాపు 3 వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నేడు గ్రాండ్‌గా నిర్వహిస్తోన్న పార్టీ ప్లీనరీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, అన్ని జిల్లాల లైబ్రరీల చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను మాత్రమే ప్లీనరీకి ఆహ్వానాలు అందాయి. ప్లీనరీకి అహ్వానం అందనివారు బాధ పడవద్దని, ఈసారి కేవలం ప్రజా ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానాలు పంపినట్లు చెప్పి ఎలాంటి అపోహలు రాకుండా ముందు జాగ్రత్త పడ్డారు కేటీఆర్.
హైదరాబాద్ లోని మాదాపూర్, హెచ్‌ఐసీసీలో రేపు జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS.#TRSPlenary #21YearsOfTRS pic.twitter.com/5RnHP7deuh
— TRS Party (@trspartyonline) April 26, 2022
తెలంగాణ భవన్‌లో, రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు..
తెలంగాణ భవన్ లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కీలక నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు ఉదయం 9 నుండి 10 గంటల మధ్య గ్రామ పంచాయతీలు, డివిజన్లు, పట్టణ వార్డుల్లో పార్టీ జెండా ఎగురవేస్తున్నారు. నియోజకవర్గాల ఇంచార్జీలు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో టీఆర్ఎస్ ఆవిర్బావ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ భవన్ లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
— TRS Party (@trspartyonline) April 27, 2022
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS.#21YearsOfTRS pic.twitter.com/EJ8FoNduXV
Also Read: TRS Plenary 2022 : టీఆర్ఎస్ 21 ఏళ్ల పండుగకు సర్వం సిద్ధం , గులబీమయమైన భాగ్యనగరం
Also Read: TRS @ 21 : టీఆర్ఎస్‌కు 21 ఏళ్లు - మరో మిషన్ ముంగిట కేసీఆర్ !
సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్‌టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల
MLA Raja Singh: ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి, ఆయన తమ్ముడైనా ఓకే: రాజాసింగ్
Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!
TS TET 2023 Results: టీఎస్ టెట్-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం
Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?
/body>