By: ABP Desam | Updated at : 26 Apr 2022 06:39 PM (IST)
టీఆర్ఎస్‌కు 21 ఏళ్లు - మరో మిషన్ ముంగిట కేసీఆర్ !
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే భావనే చాలా మంది మదిలోనుంచి తొలగిపోయిన వేళ కేసీఆర్ టీఆర్ఎస్ ను కేసీఆర్ స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియమకాల్లో అన్యాయం జరుగుతోందని.. ప్రత్యేక రాష్ట్ర సాధనే దానికి మార్గమని ఉద్యమించారు. కేసీఆర్ ఎప్పుడూ చెబుతున్నట్లుగా పిడికెడు మందితో ప్రారంభమై... కోట్ల మంది చేరి.. ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసే వరకూ సాగింది. ఉద్యమంలో సకల జనులను ఏకం చేశారు. ఇరవై ఒక్క ఏళ్ల కిందట జలదృశ్యంలో ప్రారంభమైన టీఆర్ఎస్ ఎవరూ ఊహించనంతగా ఎదిగింది. ఎదుగుతూనే ఉంది.
2009 ఎన్నికల్లో మహాకూటమిగా పోటీ చేసి 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు పరిమితం కావడంతో పరిస్థితి ఇంకా దిగజారింది. 2009 ఎన్నికల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన ఎత్తులు, వ్యూహాలను తట్టుకోలేక టీఆర్ఎస్ విలవిల లాడింది. పార్టీ నేతలంతా కాంగ్రెస్ బాట పట్టారు. పార్టీ పూర్తిగా కుదేలైన సమయంలో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. అక్కడ నుంచి తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడం టీఆర్ఎస్ కు ఊహించని స్థాయిలో కలిసొచ్చాయి. కేసీఆర్ చేపట్టిన దీక్ష సకల జనులను కదిలించడంతో డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్రం చేసిన ప్రకటన టీఆర్ఎస్ కు కొత్త ఊపు తెచ్చింది. ఆ తర్వాత ఆలస్యం అయినా .. అది టీఆర్ఎస్‌కు మరింత మేలు చేసింది. ఉద్యమ పార్టీగా.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీగా ప్రజల మన్ననలు అందుకుంది.
తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్‌ను స్థాపించారు. తెలంగాణ సాధించేవరకూ ఉద్యమపార్టీగా చెప్పేవారు. ఆ తర్వాత బంగారు తెలంగాణ సాధనలో రాజకీయ పార్టీగా మారిపోయిందనికేసీఆర్ ప్రకటించారు. బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునకేకీకరణ చేసారు . తెలంగాణలో తిరుగులేదనే స్థాయికి చేర్చారు. ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్‌ను జాతీయ స్థాయిలో కీలకంగా నిలబెట్టాలనుకుటున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తేవాలనుకుంటున్నారు. ఆ దిశగానే తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఎజెండాగా పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ మిషన్ జాతీయ రాజకీయాలు.
ఇప్పుడు టీఆర్ఎస్ క్రాస్ రోడ్స్‌లో ఉంది. ఓ వైపు రెండు సార్లు అధికారలో ఉన్నందువల్ల వచ్చిన అధికారిక వ్యతిరేకత.. మరో వైపు దూసుకొస్తున్న బీజేపీ తరహా రాజకీయాలు.. సంస్థాగతంలో బలంగా ఉన్న.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రయత్నాలు టీఆర్ఎస్‌కు సవాల్‌గా మారాయి. వీటన్నింటినీ కాచుకుంటూ ఢిల్లీకి గురి పెట్టారు కేసీఆర్. వచ్చే ఏడాదిన్నర ఆ పార్టీకి ఓ సవాల్ లాంంటిది. అయితే ఎన్నో సవాళ్లను అధిగమించిన కేసీఆర్ దాన్ని వాటిని కూడా సులువుగానే అధిగమిస్తారని టీఆర్ఎస్ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి. 4
3 Years of YSR Congress Party Rule : మూడేళ్లలో జగన్ ఎదుర్కొన్న సవాళ్లేంటి ? ఎలా అధిగమించారు ?
Rajyasabha Election Shedule : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ - అదృష్టవంతులెవరో ?
First Telugu Bibile: వైజాగ్‌లో రూపుదిద్దుకున్న తొలి తెలుగు బైబిల్ బెంగళూరులో ఎందుకుందీ?
Zodiac Signs Saturn 2022: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి
BadLuck Ministers : "నానీ"లు జగన్‌కు ఎలా దూరమయ్యారు ? వారి విషయంలో ఏం జరిగింది ?
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!