By: ABP Desam | Updated at : 05 Apr 2022 02:50 PM (IST)
బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్ లీడర్
తెలంగాణ(Telangan)లో ఆయా పార్టీల్లో ఉన్న ముఖ్యమైన నాయకులను ఆకర్షించే పనిలో ఉంది బీజేపీ(BJP). ముఖ్యంగా టీఆర్‌ఎస్(TRS)లో అసంతృప్తితో సైలెంట్‌గా ఉన్న వారిపై కన్నేసింది. అందులోభాగంగా సీనియర్ నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కమలం గూటికి చేరారు. తన అనుచరులతో కలిసి తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు, నల్లగొండ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణలో కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించేందుకు అంతా సిద్ధంగా ఉండాలన్నారు. అందుకు ప్రజలు కూడా సహకరిస్తున్నారని అభిప్రాయపడ్డారు బండి సంజయ్. ఇది గమనించిన చాలా మంది నేతలు బీజేపీవైపు చూస్తున్నారని.. భవిష్యత్‌లో ఇంకా చాలా మార్పులు జరుగుతాయన్నారు.
Koo Appఢిల్లీలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జి శ్రీ @tarunchughbjp గారి సమక్షంలో బిజెపిలో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు గారు, రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ గారు, బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పి.వి.శ్యామ్ సుందర్ రావు గారు తదితరులు పాల్గొన్నారు. - Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) 5 Apr 2022
బీజేపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు భిక్షమయ్య గౌడ్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుందనే ఉద్దేశంతోనే 2019లో టీఆర్‌ఎస్‌లో చేరానని కానీ అక్కడ తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి సాధిస్తోందని.. తెలంగాణలో కూడా అలాంటి పాలన రావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు భిక్షమయ్య గౌడ్.
ఢిల్లీలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జి శ్రీ @tarunchughbjp గారి సమక్షంలో బిజెపిలో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గారు. pic.twitter.com/qUtzjOOoH1
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 5, 2022
కాంగ్రెస్‌లో నాయకుడిగా ఎదిగిన భిక్షమయ్య గౌడ్... రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇన్నేళ్లు గడిచిన టీఆర్‌ఎస్‌లో సరైన గుర్తింపు లేని కారణంగా కారు దిగి కమలంతో ప్రయాణం మొదలు పెట్టారు.
TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే
Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు
Karimnagar: ఇంటి కింద 4 కోట్లు! వాటి కోసం క్షద్రపూజలు, తెలివిగా నమ్మించి బురిడీ కొట్టించిన దొంగ బాబాలు