By: ABP Desam | Updated at : 30 Nov 2021 12:01 PM (IST)
సమాధిని పరిశీలిస్తున్న పోలీసులు
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సోమవారం ఓ సమాధి కనిపించడం కలకలం రేపింది. ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ వసతి గృహం వెనుక భాగంలోని అటవీ ప్రాంతంలో ఈ సమాధిని విద్యార్థులు గుర్తించారు. రోజూ మాదిరిగా సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్ళిన హాస్టల్ విద్యార్థులు ఆ సమాధిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం గురించి హాస్టల్ అధికారులకు, పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఈసీహెచ్-1 వసతి గృహానికి దగ్గర్లోనే సమాధి ఉంది. దానిపై అప్పుడే చల్లిన తాజా పువ్వులు ఉన్నాయి. దీంతో అది మనిషి సమాధి అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమాధిని పరిశీలించగా అది మనిషి సమాధి తరహాలోనే ఉంది. చివరికి ఆ సమాధి ఎలా ఏర్పడిందో పోలీసులు విచారణ జరిపారు. ఓయూ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపు బస్తీకి చెందిన వ్యక్తి పెంపుడు కుక్క రెండ్రోజుల క్రితం మరణించింది. దీంతో అతను ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఈసీహెచ్-1 హాస్టల్ సమీపంలో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టాడు. సమాధి వద్ద ఉన్న ఆనవాళ్ళతో పాటు, ప్రత్యక్ష సాక్షిని విచారణ జరిపిన అనంతరం దానిని కుక్క సమాధిగా నిర్ధారించామని ఓయూ సీఐ రమేష్ నాయక్ వెల్లడించారు. దీంతో ఓయూ విద్యార్థులతో పాటు, మార్నింగ్ వాకింగ్ చేసే స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
వాకింగ్‌కు వచ్చేవారి నుంచి యూజర్ ఛార్జీలు..
ఓయూ క్యాంపస్‌లో వాకింగ్ కోసం వచ్చే బయటి వారినుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల నుంచి అనేక వందల మంది ప్రజలకు, క్యాంపస్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, యోగా వంటి ఫిట్‌నెస్ కార్యకలాపాలకు వస్తుంటారు. అయితే ఈ వాకర్స్‌కు యూనివర్సిటీ షాక్ ఇచ్చింది. డిసెంబర్ నెల నుంచి యూనివర్సిటి గ్రౌండ్‌లో వాకింగ్ చేసే వారి నుంచి రూ.200 యూజర్ చార్జీలను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Also Read: Hyderabad పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!
Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
World Hypertension Day సర్వే ఫలితాలు ఆశ్చర్యం, బాధను కల్గించాయ్, 45 ఏళ్లు దాటితే బీపీ, షుగర్ టెస్టులు తప్పనిసరి: హరీష్ రావు
TS High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే నియామకం, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బదిలీ
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్