By: ABP Desam | Updated at : 11 Feb 2022 01:40 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ సెలబ్రిటీలను కొద్ది నెలల క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఆ హడావుడి అప్పుడే ముగిసిపోగా.. ఆ టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన డిజిటల్ రికార్డులు సమర్పించాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. 2017లో కేసు వెలుగులోకి వచ్చినప్పడు ఎక్సైజ్ శాఖ చేపట్టిన విచారణలో.. డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, సాక్షులు, నిందితుల వాంగ్మూలానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఈడీ అధికారులు తెలంగాణ ఎక్సైజ్ అధికారులకు రాసిన లేఖలో కోరారు.
డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అడిగిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ యువతను అతలాకుతలం చేస్తున్నాయని, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌కు సహకరించాలని తెలిపింది. డ్రగ్స్ కేసు విచారణకు ఈడీ సమర్థమైన సంస్థ అని ధర్మాసనం అభిప్రాయపడింది. దర్యాప్తునకు అవసరమైన వివరాలు, డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే.. మళ్లీ తమను సంప్రదించవచ్చని ఈడీకి హైకోర్టు సూచించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది.
కొందరు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారని, డ్రగ్‌పెడ్లర్ కెల్విన్‌తో వాటి లావాదేవీలు నిర్వహించారన్న ఆరోపణల వేళ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఇప్పటికే సెలబ్రిటీలను విచారించిన సంగతి తెలిసిందే. ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించి మొత్తం 12 కేసులను నమోదు చేసింది. ఇటీవల ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ వాటి అభియోగ పత్రాలనూ సమర్పించి, ఈ కేసుల్లో సినీ ప్రముఖులకు సంబంధాలు లేవని తేల్చింది. ఈడీ కేసు మాత్రం ఇంకా విచారణ దశలోనే ఉంది. అయితే, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు సందర్భంగా సేకరించిన డిజిటల్ రికార్డులను ఇప్పటివరకు తమకు సమర్పించలేదని ఈడీ కొద్దిరోజుల క్రితం కోర్టుకు వెళ్లింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి గతంలో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ క్రమంలో డిజిటల్ రికార్డుల అంశం తెరపైకి వచ్చింది.
తాము దర్యాప్తు చేస్తామంటూ ఈడీ ఇది వరకే కేసులో ఇంప్లీడ్ అయింది. ఈ క్రమంలో విచారణ వివరాల్ని ఈడీకి అప్పగించాలని న్యాయస్థానం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌లు, అభియోగపత్రాలను మాత్రమే ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తమకు అప్పగించిందని, డిజిటల్ రికార్డుల్ని ఇవ్వలేదంటూ ఈడీ కోర్టుకు తెలపగా.. కేసుల్లో మనీలాండరింగ్ జరిగిందా? లేదా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఆ రికార్డులు తప్పనిసరి అని తెలిపింది. దీంతో వాటిని ఈడీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ఎక్సైజ్ విభాగానికి ఈడీ అధికారులు లేఖ రాశారు.
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
MLA Raja Singh: ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత బీజేపీ - కారణమేంటో చెప్పిన రాజాసింగ్
Who Is Telangana Opposition Leader: తెలంగాణలో ప్రతిపక్ష నేత ఎవరు? కేటీఆర్, హరీష్ కాదు, అనూహ్యంగా కొత్త పేరు!
Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్
Rahul Tweet About Revanth : రేవంత్ నాయకత్వంలో ప్రజా సర్కారు- ట్వీట్ చేసిన రాహుల్
Pavan Babu Meet : చంద్రబాబుతో పవన్ భేటీ - అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!
CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు
BRS News : అటు టిక్కెట్ రాలేదు ఇటు పదవీ ఊడింది - ఈ బీఆర్ఎస్ నేతలకు ఏడుపొక్కటే తక్కువ !
/body>