By: ABP Desam | Updated at : 07 Sep 2023 11:36 AM (IST)
కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం- నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సమీపంలో తీవ్ర విషాదం నెలకొంది. నిర్మాణంలో భవనం గోడ కూలిన దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. కూకట్‌పల్లిలోని అడ్డగుట్టలో ఈ విషాదం చోటు చేసుకుంది.
నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన హైదర్ నగర్ డివిజన్ అడ్డగుట్టలో చోటు చేసుకుంది. అడ్డగుట్టలో దాసరి సంతోష్, దాసరి శ్రీరామ్ అనే వ్యక్తులు సర్వే నెంబర్ 176పి, 177పి,188పిలోని 668 గజాలలో నిర్మాణం చేపట్టారు. దీనికి కూకట్ పల్లి జీహెచ్ఎంసీ అధికారులు స్టిల్ట్ ప్లస్ 5 అంతస్థుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు.
ఇప్పటికే ఐదు అంతస్థులు పూర్తి చేసుకున్న ఈ నిర్మాణంలో పైన ఉన్న ప్రహారీ గోడ కడుతున్న క్రమంలో పక్కకు ఒరిగిన గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో ఆ కట్టపై ఉండి పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐదుగురు కూలీలు అక్కడి నుండి కిందకు పడిపోయారు. ఈఘటనలో సంతోష్, సోనీ అనే ఇద్దరు కార్మికులు స్పాట్‌లో మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇంకొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
PGECET Seats: పీజీఈసెట్ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు
తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్
Bandi sanjay on BRS: ప్రధాని టూర్తో ప్రగతిభవన్లో ప్రకంపనలు- బీఆర్ఎస్లో చీలిక ఖాయమన్న బండి సంజయ్
Mega Dairy Project: పాడి రంగంలో మెగా ప్రాజెక్టు, రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
Inter Admissions: ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!
విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్ఫర్నేస్ మూసివేత
ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్
Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?
Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...
/body>