Hyderabad CP Sajjanar: డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లు టెర్రరిస్టులే.. చిక్కితే వదిలిపెట్టం: సజ్జనార్ వార్నింగ్
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే మొదలెట్టాశాడు సజ్జనార్. తప్పతాగి వాహనాలు నడిపితే టెరిస్టులతో సమానంగా ట్రీట్ చేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జాగ్రత్త పడండ్రోయ్ కుర్రాళ్లూ..

హైదరాబాద్: ఆర్టీసి ఎండీగా ప్రగతి రథచక్రాలను అత్యంత వేగంగా ప్రగతి మార్గంలో నడిపించిన సజ్జనార్ తాజా బదిలీలలో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. సీపీగా బాధ్యతలు తీసుకున్న మొదటిరొోజే తన మార్క్ పోలీసింగ్ గుర్తు చేస్తూ మందుబాబులకు చెమటలు పట్టించేలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై డ్రంక్ డ్రైవ్ చేస్తూ దొరికితే తాట తీస్తామని హెచ్చరించారు. ఇకపై తప్పతాగి వాహనాలు నడుపకుండా జాగ్రత్త పడండ్రా కుర్రాళ్లూ., తేడా వస్తే ఊచలు లెక్కించాల్సిందేనంటూ బాధ్యతలు తీసుకున్న వెంటనే సింగంలా గర్జించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ.. గతంలో తాను సీపీ గా ఉన్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కుపాదం మోపడం జరిగిందని. ఇప్పటికైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికితే వదిలే ప్రసక్తి లేదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం అనేది రోడ్డు టెర్రరిజంతో సమానమని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లు టెర్రరిస్టులతో సమానమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం త్రాగిన మత్తులో ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్లు చనిపోతారో తెలియదు. ఏమవుతారో కూడా తెలియదన్నారు. తాగి వాహనాలు నడపడం వల్ల అనేక ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం త్రాగి వాహనాలు నడిపేవారు సూసైడ్ బాంబర్లని, ఒకరి చంపొచ్చు, నలుగురి చంపొచ్చని, వాళ్లు రోడ్డెక్కితే ఎవరి ప్రాణాలు పోతాయో తెలియదన్నారు. ఇకపై మద్యం త్రాగి వాహనాలు నడిపేవారిని పట్టుకునేందుకు, సిబ్బందిని పెంచడంతోపాటు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నగర వ్యాప్తంగా భారీ స్దాయిలో పెంచబోతున్నట్లు తెలిపారు సిపీ సజ్జనార్.
డ్రగ్స్ ముఠాల భరతం పడతాం..
డ్రగ్స్ సరఫరా ముఠాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. ఎట్టిపరిస్దితుల్లోనూ సహించేది లేదని, డ్రగ్స్ ముఠాల వెనుకు ఎవరున్నా వదిలే ప్రశక్తేలేదన్నారు. ఇప్పటి వరకూ ఎవరెవరు అరెస్ట్ అయ్యారు. విచారణ ఎంతవరకూ జరిగింది. ఇలా ప్రతీ డ్రగ్స్ కేసును రివ్యూ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు జరుగుతున్న డ్రగ్స్ సరఫరాను కట్టడి చేస్తామన్నారు.
ట్రాఫిక్ సమస్యపై జనం సలహాలు తీసుకుంటాం..
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతోందన్నారు సజ్జానార్. వాహానాలు సంఖ్య నగరంలో విపరీతంగా పెరగడంతో రొోడ్డెక్కితే చాలు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, దీనిపై జనంలో పూర్తి అవగాహాన కలిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం వాహనదారుల సలహాలు కూడా తీసుకుంటామన్నారు. జీఎస్టీ తగ్గిన తరువాత వాహానాల సంఖ్య ఇంకా పెరిగిందని, ప్రస్తుతం ట్రాపిక్ పోలీసుల పనితీరు బాగున్నప్పటికీ , ఇంకా సమస్య పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు సజ్జనార్.





















