By: ABP Desam | Updated at : 29 Mar 2023 11:17 PM (IST)
36 ఎకరాల్లో రూపు దిద్దుకుంటున్న అంబేద్కర్ స్మృతివనం
Hyderabad largest Ambedkar statue in the country: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరణకు సిద్దమవుతోంది. ఇందుకోసం 425 మంది సిబ్బంది రేయింబళ్లు శ్రమిస్తున్నారు. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కరణ జరగబోతోంది. విగ్రహం ఎత్తు125 అడుగులుంటే, 36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటవుతోంది. విగ్రహం కోసం 791 టన్నుల స్టీల్ వాడుతున్నారు. 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువు దీరబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్మృతివనం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో 36 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇందులో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా కొనసాగుతున్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహా నిర్మాణం పనులు చివరి అంకానికి చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎప్పటికప్పుడు పనులు దగ్గర ఉండి పర్యవేక్షస్తున్నారు. 425 మంది సిబ్బంది రేయింబవళ్ళు నిర్మాణం పనుల్లో నిమగ్నం అయ్యారు.
ప్రధాన విగ్రహంతోపాటు అక్కడ నిర్మిస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెయిన్, సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 125 అడుగుల ఎత్తుతో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. ఇది తెలంగాణకే మణిహారంగా నిలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఏప్రిల్ 10కల్లా నిర్మాణ పనులన్నీ పూర్తిచేసే లక్ష్యంతో సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన అన్నారు. విగ్రహం ఆవిష్కరణపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
ఈనెల (మార్చి 10న) సచివాలయం పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ పక్కనే నిర్మాణంలో వున్న డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ విగ్రహం బేస్ లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్లను ఆడియో విజువల్ ప్రదర్శనకోసం నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు, బయట ఫౌంటేన్, లాండ్ స్కేపింగ్ తదితర పనుల పురోగతిని పరిశీలించారు. పనుల నాణ్యతలో ఏమాత్రం లోటు రావద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. చారిత్రకంగా నిర్మితమౌతున్న విగ్రహం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అనంతరం అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. మొదటి అంతస్తులో ఆడియో, వీడియో ప్రదర్శనల కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం, లేజర్ షో, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ పనులను పరిశీలించారు.
మరోవైపు పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ చొరవతో విగ్రహ ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్ అనుమతి ఇచ్చారు. ఏప్రిల్ 14న ఈ విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. సెంట్రల్ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే దానం నాగేందర్ పరశీలించారు.
Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
Group1: గ్రూప్-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!
Hyderabad Lady Death: బెంగళూరులో హైదరాబాద్ యువతి మృతి, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు!
SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!