అన్వేషించండి

TG Ration Cards: రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, పెండింగ్ దరఖాస్తులకు లైన్ క్లియర్

Telangana News | తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్డులలో కొత్త పేర్లు చేర్చడానికి పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ (Telangana) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్ని ఏళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం చేస్తున్న నిరీక్షణకు మోక్షం లభించనుంది. మీ పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చే ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకూ రేషన్ కార్డుల్లో అవసరం లేని సభ్యులను తొలగించడం కొసాగుతుండగా, తాజాగా కొత్త సభ్యులను చేర్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో తెలంగాణ పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేరిక కోసం దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తోంది. 

మే నెల కోటా కేటాయింపు
ఇప్పటివరకు రేషన్ కార్డులలో సభ్యులు తొలగింపు కొనసాగుతుండగా, తాజాగా కొత్త సభ్యుల చేరిక ఆప్షన్ కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో దరఖాస్తులు పరిశీలించి కొత్త సభ్యులను అధికారులు ఆమోదిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ అయినప్పటికీ, ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ సరుకులు ఇవ్వన్నట్లు తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తులు 20 శాతం మేర పరిష్కరించి వాటికి సైతం మే నెల రేషన్ కోటాను పౌరసరఫరాల శాఖ కేటాయించింది. మిగతా దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పరిశీలించి ఒక్కొక్కటిగా ఆమోదిస్తోంది. 

రేషన్ కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు, త్వరలోనే పరిష్కారం
తెలంగాణలో 2 కోట్ల 81 లక్షల కుటుంబాలకు దాదాపు 90 లక్షల మేర రేషన్ కార్డులున్నాయి. కానీ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో, అటు ప్రైవేట్ ఆస్పత్రిలో నూ ఈ కార్డులు లేక ఉచిత వైద్యం సైతం చేయించుకోలేకపో తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రేషన్ కార్డులపై కదలిక వచ్చింది. రేషన్ కార్డులు జారీలో జాతీయ జరుగుతున్న, దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రేషన్ కార్డులో కొత్త సభ్యుల చివరి కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలు వేరై రెండు మూడు కుటుంబాలుగా విడిపోయిన, కుటుంబంలో కొత్త వ్యక్తి పుట్టినా ప్రత్యేకంగా రేషన్ కార్డులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నప్పటికీ తమకి ఇంకా రేషన్ కార్డులు జారీ కావడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు, జనవరి నెలలో గ్రామసభలో వచ్చిన దరఖాస్తులు, ఆపై మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను  పౌరసరఫరాల శాఖ పరిశీలించి ఆమోదిస్తోంది. కొందరు ఒకే రేషన్ కార్డు కోసం మూడు నాలుగు దరఖాస్తులు ఇచ్చినట్లుగా అధికారులు తెలిపారు. అందువల్లే రేషన్ కార్డులు జారీలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ఇటీవల ఆమోదం పొందిన రేషన్ కార్డులకు మే నెల కోటా కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ కారణంగా రేషన్ కార్డుల జారీలో జాప్యం జరుగుతోందని నేతలు చెబుతున్నారు. కానీ ఏడాదిన్నర గడిచినా కొత్త రేషన్ కార్డులు తమ చేతికి మాత్రం రాలేదని ప్రజలు అంటున్నారు. రేషన్ కార్డులను రెండు రకాలుగా జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిసిందే.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget