Bigg Boss Show: మళ్లీ వివాదంలో బిగ్ బాస్, నాగార్జునపై చర్యలకు డిమాండ్ - హైకోర్టులో పిటిషన్
Bigg Boss News: కంటెస్టెంట్లు అందరినీ విచారణ చేయాలని పిటిషన్ లో కోరారు. ఇదే విషయంపై మహిళా కమిషన్ ఛైర్మన్ కి ఫిర్యాదు చేస్తామని పిటిషనర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ తెలిపారు.
Bigg Boss Show News: బిగ్ బాస్ (Bigg Boss) షో మళ్లీ వివాదంలో చిక్కుకుంది. ఆ రియాలిటీ షోపై తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బిగ్ బాస్ (Bigg Boss News) నిర్వహకుడు నాగార్జునని అరెస్ట్ చేయాలని హైకోర్టులో దాఖలు చేసిన ఆ పిటిషన్ లో కోరారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఆ పిటిషన్ వేశారు. బిగ్ బాస్ (Bigg Boss Winner) పేరుతో కొందరు వ్యక్తులను అక్రమంగా 100 రోజుల పాటు నిర్బంధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బిగ్ బాస్ (Bigg Boss Show) షో ముగింపు సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంపై కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. దాని వెనుక ఉన్న కుట్ర బయటికి తీయాలని కోరారు.
ఇందుకోసం బిగ్ బాస్ (Bigg Boss Latest News) పోటీలో ఉన్న కంటెస్టెంట్లు అందరినీ విచారణ చేయాలని పిటిషన్ లో కోరారు. ఇదే విషయంపై మహిళా కమిషన్ ఛైర్మన్ కి ఫిర్యాదు చేస్తామని పిటిషనర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ తెలిపారు.