Ganja Case: గంజాయి కేసులో టీడీపీ లీడర్ అరెస్టు- హైదరాబాద్ తరలిస్తున్న పోలీసులు
హైదరాబాద్‌లో టీడీపీ మహిళా నేత అరెస్టు సంచలనంగా మారింది. ఆమె గంజాయిలో ముద్దాయిగా ఉన్నారని పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ తరిలించారు.
![Ganja Case: గంజాయి కేసులో టీడీపీ లీడర్ అరెస్టు- హైదరాబాద్ తరలిస్తున్న పోలీసులు Telugu desam Leader arrested In Ganja smuggling Case Ganja Case: గంజాయి కేసులో టీడీపీ లీడర్ అరెస్టు- హైదరాబాద్ తరలిస్తున్న పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/caf6131a0f8735664c966263543a878d_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గంజాయి కేసులో టీడీపీ మహిళా నేత ఉండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మానుకొండ జాహ్నవి అనే మహిళీ లీడర్ కేసుల్లో ఇరుక్కున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తున్న తెలంగాణ పోలీసులు.
2013లో రిజిస్టర్ అయిన గంజాయి అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన మానుకొండ జాహ్నవి అనే మహిళను అరెస్టు చేశారు. ఆమె టీడీపీ లీడర్‌గా ఉన్నట్టు తెలిపారు పోలీసులు. ఆమెను నరసరావుపేట నుంచి హైదరాబాద్ తరిలిస్తున్నారు దుండిగల్ పోలీసులు.
2013లో రిజిస్టర్ అయిన గంజాయి తరలింపు వ్యవహారంలో NDPC Actలో నలుగురిపై కేసు నమోదు చేశారు దుండిగల్ పోలీసులు. కేసును విచారించిన పోలీసులు గతంలోనే ఇద్దర్ని అరెస్టు చేశారు. అదే కేసులో టీడీపీ లీడర్‌ను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. శ్రీనివాస్ అనే మరో వ్యక్తి పరారిలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)