బీఆర్ఎస్ కు మాజీ మంత్రి క్రిష్ణయాదవ్ రాజీనామా
మాజీ మంత్రి క్రిష్ణ యాదవ్...బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. నాలుగైదు రోజుల్లో రాజకీయ భవిష్యత్ ను ప్రకటించనున్నట్లు తెలిపారు.

మాజీ మంత్రి క్రిష్ణ యాదవ్... బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో గులాబీ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో...నిరాశ కలిగించిందన్నారు. ఆత్మగౌరవంలేని పార్టీలో కొనసాగడం ఇష్టం లేకే... బీఆర్ఎస్ ను వీడుతున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ అన్న ఆయన...భూస్వాములకు, పెత్తం దారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. నాలుగైదు రోజుల్లో రాజకీయ భవిష్యత్ ను ప్రకటించనున్నట్లు తెలిపారు.
గతంలో హిమాయత్‌నగర్ నియోజకవర్గం నుంచి 1994,1999లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. మారిన రాజకీయ పరిస్థితులతో 2016లో టీడీపీకి గుడ్ బై చెప్పి బీఆర్‌ఎస్ లో చేరారు. సీనియార్టీ, ఇంత పలుకుబడి ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని గత కొన్నిరోజులుగా పార్టీ మారాలని అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు యాదవ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కృష్ణ యాదవ్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అంబర్ పేట లేదా మలక్ పేట టికెట్ ను అడుగుతున్నట్లు తెలుస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

