Malla Reddy House: రాజీనామాకే కట్టుబడ్డా, రేవంత్ తాట తీసుడే.. తేల్చి చెప్పిన మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ నేతల ముట్టడి
మల్లా రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఎస్సీ నేతలు ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు మల్లా రెడ్డి ఇంటికి చేరుకుని కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లా రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా ఆ వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ మేరకు గురువారం మల్లా రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. అంతేకాక, మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి మల్లా రెడ్డి దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. ఆ తర్వాత మంత్రి మల్లా రెడ్డిపై మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. బోయిన్ పల్లిలో మల్లా రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఎస్సీ నేతలు ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు మల్లా రెడ్డి ఇంటికి చేరుకుని కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 20 మంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు మల్లా రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: Tank Bund No Entry: ట్యాంక్ బండ్‌పైకి ఈ టైంలో నో ఎంట్రీ, ఇక పర్మినెంట్‌గా ఇంతే.. సీపీ వెల్లడి
మరోవైపు, తన రాజీనామాకు సిద్ధంగానే ఉన్నానని మంత్రి మల్లా రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, ఇక తాట తీసుడేనని ఆయన హెచ్చరించారు. తనపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఆయన చెప్పారు. తన 13 విద్యా సంస్థల్లో ఎలాంటి అవకతవకలు లేవని ఎంహెచ్ఆర్‌డీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇద్దరం రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు.
రేవంత్ విమర్శలివీ..
మూడు చింతలపల్లిలో దళిత గిరిజన దీక్ష ముగింపు సభలో రేవంత్ రెడ్డి మంత్రి మల్లా రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి విద్యా సంస్థల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని విమర్శించారు. మల్లారెడ్డి యూనివర్శిటీకి ప్రభుత్వం అక్రమంగా భూములు కేటాయించిందని రేవంత్ ఆరోపించారు.
Also Read: Dalitbandhu KCR : హుజురాబాద్‌లో దళిత బంధు అర్హుల ఎంపిక సర్వే షురూ..! పథకం అందరికీ కాదా..?