News
News
X

Bandi Sanjay: బండి సంజయ్ రిక్వెస్ట్ కు మహిళా కమిషన్ ఓకే, విచారణ ఎప్పుడంటే!

విచారణకు హాజరుకావడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన విజ్ఞప్తి మేరకు మార్చి 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కమిషన్‌ ప్రకటించింది.

FOLLOW US: 
Share:

హైదరాబాద్‌: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కు రాష్ట్ర మహిళా కమిషన్‌ స్వల్ప ఊరట కలిగించింది. విచారణకు హాజరుకావడంపై ఆయన విజ్ఞప్తి మేరకు మార్చి 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కమిషన్‌ ప్రకటించింది. అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసింది. 

మార్చి 15న కమిషన్ ఆఫీసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్న కారణంగా తాను మార్చి 15న విచారణకు హాజరు కాలేనని మహిళా కమిషన్ కు లేఖ రాశారు. వీలు కల్పిస్తే మార్చి 18న విచారణకు హాజరు అవుతానని రిక్వెస్ట్ చేశారు. బండి సంజయ్ అభ్యర్థనపై  మహిళా కమిషన్ సానుకూలంగా స్పందించింది. ఈ 18న ఉదయం 11 గంటలకు కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని, లేకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసు ద్వారా కమిషన్ హెచ్చరించింది. 

రాష్ట్ర మహిళా కమిషన్ కు బండి లేఖ 
మహిళా కమిషన్ కు ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. మహిళా కమిషన్ ఎదుట రేపు(బుధవారం) హాజరు కాలేనని ఈ లేఖలో బండి సంజయ్  తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న కారణంగా రేపు మహిళా కమిషన్ ఎదుట హాజరు కాలేనని తెలిపారు. ఈనెల 18న (ఆదివారం) సమయమిస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు. ముందుగా సమాచారం ఇచ్చే ఆ సమయానికి హాజరవుతానని చెప్పారు.   

మహిళా కమిషన్ నోటీసులు 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజ‌య్‌ కుమార్ కు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. మార్చి 15న ఉద‌యం 11 గంట‌ల‌కు కార్యాలయంలో వ్యక్తిగ‌తంగా విచారణకు హాజ‌రు కావాల‌ని మహిళా క‌మిష‌న్ బండి సంజయ్ ను ఆదేశించింది. ఓ సమావేశంలో కవితపై విమర్శలు చేస్తూ.. అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని  బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది.  ఈ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై  మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విచారణకు కూడా ఆదేశించింది. సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

బండి సంజయ్ ఏమన్నారంటే ?

ఇటీవల బీజేపీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం కూతురు మాత్రమే గొప్ప అన్నట్లు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన ఉందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ కేసులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, తప్పు చేయకుంటే కోర్టు ద్వారా నిరూపించుకుని బయటకు రావాలని ఆయన అన్నారు. ఇంతక ముందే మీడియా వాళ్లు కవితను అరెస్ట్ చేస్తారని ఓ ప్రశ్న అడిగారని, దోషిగా తేలితే అరెస్ట్ చేయక ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 

Published at : 15 Mar 2023 06:24 PM (IST) Tags: Bandi Sanjay Kavitha Telangana Telangana State Womens Commission

సంబంధిత కథనాలు

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు-  మంత్రి కేటీఆర్

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Sriram Shobha Yatra : హైదరాబాద్ లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభయాత్ర, భారీగా బందోబస్తు

Sriram Shobha Yatra : హైదరాబాద్ లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభయాత్ర, భారీగా బందోబస్తు

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

టాప్ స్టోరీస్

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు