Notice To KTR: మహిళలపై కామెంట్స్, కేటీఆర్కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు
Free Bus for Women In Telangana | రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కొందరు మహిళలు దుర్వినయోగం చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారు. అవసరమైతే బస్సుల్లో డ్యాన్సులు చేయాలనడం వివాదాస్పదమైంది.
Telangana Women Commission sent notices to KTR | మాజీ మంత్రి ,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 24వ తేదీన కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులలో ఆదేశించింది. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ ఇదివరకే సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
బస్సుల్లో మహిళల ప్రయాణంపై కామెంట్స్
బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తు్న్నారు. కొందరు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తూ కూరగాయలు అమ్మడం, మరికొందరేమో బ్రష్ చేయడం, కొందరు వెల్లుల్లి ఒలుస్తూ కనిపించడంపై కేటీఆర్ స్పందించారు. కుట్లు, అల్లికలే మాత్రమే కాదు, అవసరమైతే బస్సుల్లో ప్రయాణిస్తూ డ్యాన్సులు కూడా చేసుకోండని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో ఎవర్నీ తప్పుపట్టడం లేదని, అయితే బస్సులు పెంచాలని, అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు కేటాయించాలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..
— KTR (@KTRBRS) August 16, 2024
నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.
క్షమాపణ కోరిన కేటీఆర్..
పార్టీ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలు యథాలాపంగా చేసిన కామెంట్స్ అని, తన వ్యాఖ్యలతో సోదరీమణులకు మనస్తాపం చెందితే విచారం వ్యక్తం చేస్తున్నా అన్నారు. అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశంతో ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా తీసుకోవద్దని, కావాలని చేసిన వ్యాఖ్యలు కాదని.. తన వ్యాఖ్యలపై కేటీఆర్ విచారం వ్యక్తం చేస్తూ సారీ చెప్పారు. కానీ కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా మంత్రి సీతక్క స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు మహిళల్ని గౌరవించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. వివాదం పెద్దది కావడంతో మహిళా కమిషన్ ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ ను విచారణకు హాజరు కావాలంటూ శుక్రవారం నాడు నోటీసులు పంపింది.