Raj Bhavan Theft: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ, కీలక ఫైల్స్ మాయం.. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Telangana Raj Bhavan Theft Case | తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్ డిస్కులు చోరీ కావడం కలకలం రేపుతోంది.

Telangana News | హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ జరగడం కలకలం రేపుతోంది. రాజ్ భవన్ లోని సుధర్మ భవన్‌లో 4 హార్డ్‌డిస్క్‌లు చోరీ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మే 13వ తేదీన నాలుగు హార్డ్ డిస్కులు చోరీ కాగా, రాజ్‌భవన్ అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగ ఎవరో కనిపెట్టారు. కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ సుధర్మ భవన్‌లో హార్డ్ డిస్కులు చోరీ చేసినట్లు గుర్తించి, అరెస్ట్ చేశారు.
మొదటి అంతస్తులోని గది నుంచి హార్డ్‌డిస్కులు చోరీ అయినట్లు రాజ్‌భవన్ సిబ్బంది సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. ఈ విషయంపై మే 14న రాజ్‌భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూంలోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. హార్డ్ డిస్క్ లలో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్ట్‌లు, ఫైల్స్ ఉంటాయని సిబ్బంది పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.






















