Amrit Bharat Station Yojana: మే 22న 103 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. లిస్టులో బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు
అమృత భారత్ స్టేషన్ యోజన: 2022 డిసెంబర్ లో ప్రారంభించబడిన ఈ పథకం ద్వారా 1300 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు.

PM Modi Amrit Bharat Station Yojana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం తర్వాత వాటిని తిరిగి ప్రారంభించనున్నారు. మే 22, 2025న ప్రధాని మోదీ వర్చువల్‌గా జరగనున్న కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా అత్యాధునికంగా తీర్చిదిద్దన రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. వీటిలో తెలంగాణ నుంచి కరీంనగర్, వరంగల్, బేగంపేట రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లన్నీ అమృత భారత్ స్టేషన్ యోజనలో భాగంగా రీడిజైన్ చేసి, అత్యాధునికంగా తీర్చిదిద్దారు. వీటిలో మధ్య రైల్వేకు చెందిన 12 ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. వీటిని రూ. 138 కోట్లకు పైగా ఖర్చుతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆ రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేసింది.
రైల్వే మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2022లో అమృత భారత్ స్టేషన్ యోజన ప్రారంభించించింది. దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను ఆధునిక రవాణా కేంద్రాలుగా మార్చాలనే లక్ష్యంతో పనులు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 6, 2023, ఫిబ్రవరి 26, 2024 తేదీల్లో రెండు దశల్లో రైల్వే స్టేషన్ల పునరుద్దరణకు చేశారు.
కరీంనగర్, వరంగల్, బేగంగపేట రైల్వేస్టేషన్లు సైతం
దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో శ్రీధర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బేగంపేటతో పాటు కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లను సైతం 103 రైల్వే స్టేషన్లతో పాటు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను రూ. 25.85 కోట్లు, వరంగల్ రైల్వే స్టేషన్‌ను రూ.25.41 కోట్లు, బేగంపేట రైల్వేస్టేషన్‌ను రూ.26.55 కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసింది. విమనాశ్రయాన్ని తలపించేలా రైల్వే స్టేషన్లను కేంద్రం డెవలప్ చేసిందన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ సైతం ఏర్పాటు చేశామన్నారు.
అంధులు సైతం ఎవరి సాయం లేకుండా వరంగల్ రైల్వే స్టేషన్లో టెక్టైల్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ డివిజనల్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఐ శ్రీరామమూర్తి తెలిపారు. కరీంనగర్ రైల్వేస్టేషన్లో రెండు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు, 2 కొత్త ప్లాట్‌ఫాంలు సిద్ధం చేశామని సికింద్రాబాద్ రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ పి శివప్రసాద్ తెలిపారు.
కేవలం 15 నెలల్లో మధ్య రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణం
మధ్య రైల్వే 12 స్టేషన్లను కేవలం 15 నెలల్లో అభివృద్ధి చేశారు. వాటిలో ముంబైలోని చిన్చపోక్లి, పరేల్, వడాలా రోడ్, మాటుంగా రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈ స్టేషన్లను ఆధునిక సాంకేతికత, వికలాంగులకు అనుకూలమైన సౌకర్యాలుతో అభివృద్ధి చేశారు.
మాటుంగా స్టేషన్ - ఖర్చు రూ. 17.28 కోట్లు
భారతదేశంలో మొట్టమొదటి మహిళా నిర్వహణ స్టేషన్ మాటుంగా ఇప్పుడు మరిన్ని హంగులు సంతరించుకుంది. ప్లాట్‌ఫామ్ విస్తరణ, వికలాంగులకు అనుకూలమైన ఏర్పాట్లు, ఎలివేటెడ్ బుకింగ్ ఆఫీసు నవీకరణ, స్టేషన్‌ను మరింత అందంగా చేశారు. రోజుకు సుమారు 37,927 మంది ప్రయాణీకులకు ఈ స్టేషన్ సేవలు అందిస్తోంది.
చిన్చపోక్లి స్టేషన్ - ఖర్చు రూ. 11.81 కోట్లు
ముంబై లోని చిన్చపోక్లి స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు, బుకింగ్ ఆఫీసు, వెయిటింగ్ ఏరియా, త్రాగునీటి బూత్, వెర్టికల్ గార్డెన్, సర్కులేటింగ్ ఏరియాలో అనేక సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ రోజుకు సగటున 36,696 మంది ప్రయాణస్తుంటారు.
పరేల్ స్టేషన్ - ఖర్చు రూ. 19.41 కోట్లు
ఇక్కడ కొత్త స్టేషన్ భవనం, మరుగుదొడ్లు, పార్కింగ్, నీటి పారుదల వ్యవస్థ, తోటలు మరియు బుకింగ్ ఆఫీసు నిర్మించారు. రోజుకు 47,738 మంది ప్రయాణీకులు ఈ స్టేషన్‌ను ఉపయోగిస్తున్నారు.
వడాలా రోడ్ స్టేషన్ - ఖర్చు రూ. 23.02 కోట్లు
స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫామ్‌లు, FOBలు, బుకింగ్ ఆఫీసు, మరుగుదొడ్లు మరియు ప్రవేశ ద్వారాలను నవీకరించారు. ఇక్కడ రోజుకు సగటున 1.32 లక్షల మంది ప్రయాణీకులు వస్తుంటారు.
మహారాష్ట్రలో 132 స్టేషన్ల పునర్నిర్మాణం
కేవలం మహారాష్ట్రలోనే మొత్తం 132 స్టేషన్ల పునర్నిర్మాణం జరుగుతోంది. వీటిలో మే 22న 18 స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు, స్టేషన్లో సేవలు సులభతరం, సురక్షిత ప్రయాణాన్ని అందించడంతో పాటు స్టేషన్లను అభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా మార్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.






















