TOSS SSC And Inter results 2025: తెలంగాణలో ఓపెన్ స్కూల్ టెన్స్, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
TOSS SSC And Inter results 2025: తెలంగాణలో ఏప్రిల్- మేలో జరిగిన ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సొసైటీ ద్వారా టెన్త్, ఇంటర్‌ను ప్రైవేటుగా చదువుకోవచ్చు.

TOSS SSC And Inter results 2025: తెలంగాణలో ఓపెన్ స్కూల్‌లో టెన్త్, ఇంటర్ చదివి రాసిన పరీక్షలు ఫలితాలు ఇవాళ(7 జూన్ 2025) విడదలయ్యాయి. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అంటే టాస్ పేరుతో ఈ కోర్సులను నిర్వహిస్తోంది. ఇక్కడ టెన్త్, ఇంటర్ రెండు కోర్సులు పూర్తి చేయవచ్చు. వీళ్లకు ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు పెట్టారు. ఆ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లు అధికారిక వెబ్‌సైట్ telanganaopenschool.org.కి వెళ్లి తమ ఫలితాలు చూసుకోవచ్చు.
ఈ టాస్ చేపట్టిన ఓపెన్ ఇంటర్, టెన్త్‌కు సంబంధించిన థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు జరిగాయి. ఉదయం, సాయంత్ర రెండు పూటల పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్ర 5.30 వరకు పరీక్షలు చేపట్టారు. ఈ కోర్సుకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26నుంచి మే 3 వ తేదీ వరకు జరిగాయి. ఈ రెండు పరీక్షల ఫలితాలను అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు.
వెబ్‌సైట్‌లో TOSS SSC And Inter results 2025 ఫలితాన్ని ఎలా చూడాలి
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి
- హోమ్‌పేజ్‌లో కనిపించిన TOSS SSC Results 2025 లేదా TOSS Inter Results 2025పై క్లిక్ చేయాలి
- తర్వాత మీరు మీకు పరీక్షల్లో ఇచ్చిన అడ్మిషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్ లేదా రిజిస్ట్రేష్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- అలా ఎంటర్ చేసిన తర్వాత సబ్‌మిట్ చేయాలి.
- వెంటనే మీ రిజల్ట్ మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌అవుట్ తీసి పెట్టుకొని ఒరిజినల్ సర్టిఫికెట్స్ వచ్చే వరకు ఇది బాగా యూజ్ అవుతుంది.
ఇంటర్ ఫలితాల కోసం ఈ డైరెక్ట్ లింక్ క్లిక్ చేయండి
పదోతరగి ఫలితాల కోసం ఈ డైరెక్ట్ లింక్ క్లిక్ చేయండి
మార్క్‌షీట్‌లో ఏం ఉంటుంది
ఆన్‌లైన్‌లో వచ్చి ఫలితాల షీట్‌లో సబ్జెక్ట్ వైజ్‌గా మార్కులుఉంటాయి. మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయో కూడా చూపిస్తుంది. పరీక్ష రాసిన అభ్యర్థి పాస్ అయ్యాడో లేదో కూడా చెబుతుంది. ఓవరాల్‌గా, ప్రతి సబ్జెక్ట్‌లో విద్యార్థులు తమ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.
వచ్చే ఏడాదికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో త్వరోలనే పెట్టనున్నారు. ఈ కోర్సు వచ్చే అక్టోబర్ నుంచి ప్రారంభంకానుంది. అంత వరకు రెగ్యులర్‌గా అప్‌డేట్స్ అందిస్తుంటామని అధికారులు పేర్కొన్నారు. బయట సర్క్యలేట్ అయ్యే సమాచారాన్ని నమ్మొద్దని అధికారిక వెబ్‌సైట్‌లోనే పరీక్షలు, ఇతర వివరాలు అందిస్తామని అన్నారు.
ఈ సర్టిఫికెట్స్‌తో ఏం చేయొచ్చు
విద్యార్థులకు చదువు చెప్పడం, వారికి పరీక్షలు పెట్టడం, సర్టిఫికెట్స్ జారీ చేస్తుంది. వివిధ కారణాలతో చదువును మధ్యలో మానేసిన వాళ్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సొసైటీ ద్వారా ఓపెన్ విధానంలో టెన్త్, ఇంటర్ కోర్సులు పూర్తి చేయవచ్చు. ఓపెన్ విధానంలో చాలా మంది విద్యావంతులు అవుతున్నారు. సర్టిఫికెట్స్ పొందుతున్నారు. వేర్వేరు ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు. ప్రభుత్వం పోటీ పరీక్షలకు ఈ సర్టిఫికెట్స్‌ను అనుమతి ఇస్తున్నారు. చాలా మంది ఈ విధానంలో చదువుకొని ఆర్మీలో చేరిన వారు ఉన్నారు.





















