శంషాబాద్ టు నాగోల్ ఎక్స్‌ప్రెస్ వే-నార్సింగిలో ప్రకటించిన మంత్రి కేటీఆర్
మూసీనదిపై నిర్మించే వంతెనల్లో భాగంగా శంషాబాద్ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించబోతున్నట్టు తెలిపారు కేటీఆర్. దీనికి 15వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై నిర్మించిన ఇంటర్ ఛేంజ్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై నిర్మించిన 20వ ఇంటర్ ఛేంజ్ ఇది.
ఔటర్ రింగ్ రోడ్‌పై నిర్మించిన 20వ ఇంటరర్‌ఛేంజ్‌ను ప్రారంభించిన తర్వాత మాట్లాడిన మంత్రి కేటీఆర్... దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్ సొంతమని అన్నారు. అలాంటి నగరంలో మణిహారంలా ఓఆర్‌ఆర్ ఉందన్నారు. ఇప్పటికే నగరంలో ఫ్లైఓవర్‌లతోపాటు, అండర్‌పాస్‌లు నిర్మించామని తెలిపారు. వీటితోపాటు మూసీనదిపపై బ్రిడ్జిలు కూడా నిర్మించబోతున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే 14 వంతెనలకు శంకుస్థాపన చేయబోతున్నట్టు ప్రకటించారు.
Improved Connectivity: Telangana Government Unveils Narsingi Interchange on Outer Ring Road (ORR)
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 1, 2023
MA&UD Minister @KTRBRS along with Minister @SabithaindraTRS inaugurated the interchange built at a cost of Rs.29.50 crore at Narsingi.
The construction of Narsingi Interchange… pic.twitter.com/7zmkS5FgyD
మూసీనదిపై నిర్మించే వంతెనల్లో భాగంగా శంషాబాద్ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించబోతున్నట్టు తెలిపారు కేటీఆర్. దీనికి 15వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మరోవైపు మెట్రో విస్తరణ విషయంలో కూడా పనులు ఊపందుకోనున్నాయని తెలిపారు. రెండున్నరేళ్లలో శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ పూర్తవుతుందన్నారు. బీహెచ్‌ఈఎల్ నుంచి కందుకూరు ఫార్మాసిటీ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
MA&UD Minister @KTRBRS speaking after inaugurating interchange at Narsingi (Entry and Exit Ramp of ORR) https://t.co/rcGmZihu2B
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 1, 2023
హైదరాబాద్‌లో 100 శాతం మురుగునీటి శుద్ధి జరుగుబోతోందన్నారు. కేటీఆర్. దీని కోసం దాదాపు నాలుగు వేల కోటల ఖర్చుతో 31 ఎస్టీపీ ప్లాంట్‌లు నిర్మించబోతున్నట్టు కూడా తెలిపారు. మొదటికి కోకాపేటలో ప్రారంభిస్తన్నట్టు తెలిపారు. సెప్టెంబర్ నాటికి అన్నింటినీ ప్రారంభించి దేశంలోనే మొదటి 100 శాతం మురుగునీటి శుద్ధ నగరంగా హైదరాబాద్ మారబోతుందన్నారు.
Will also be throwing open a new interchange at Narsingi junction on the ORR today
— KTR (@KTRBRS) July 1, 2023
This will be of a great relief to all the bustling areas near by pic.twitter.com/RGvS2S7Nhp
As promised, Hyderabad will become the first major city in India to treat 100% of its sewerage by September, 2023 💪
— KTR (@KTRBRS) July 1, 2023
As part of this effort, we are building number of STPs with 1259.50MLD at a cost of ₹3,866 Crore
Will be inaugurating the first STP in Kokapet with 15 MLD… pic.twitter.com/0JIi8PjmxF