అన్వేషించండి

Steel Fly Over: హైదరాబాద్ సిగలో మరో అద్భుత ఫ్లై ఓవర్, 100 ఏళ్లు నిలిచేలా నిర్మాణం

Indira Park VST Steel Fly Over: హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహం లాంటిది. నిత్యం నరకం. అలాంటి ట్రాఫిక్ పద్మవ్యూహానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫ్లై ఓవర్ల నిర్మిస్తోంది.

Indira Park VST Steel Fly Over: హైదరాబాద్ ట్రాఫిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక పద్మవ్యూహం, నిత్యం నరకం. అలాంటి ట్రాఫిక్ పద్మవ్యూహానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫ్లై ఓవర్ల నిర్మిస్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద రూ.30 వేల కోట్లతో ప్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తోంది. ఇప్పటివరకు 32 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. మరి కొద్ది రోజుల్లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా వీఎస్టీ వరకు నిర్మించిన 2.6 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జి అతి త్వరలో నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది.  ఆగస్టు 19న ఈ ఇందిరా పార్క్ టూ వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రాంభించనున్నారు. 

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో వాహనదారుల కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఫ్లై ఓవర్ల నిర్మాణాలు చేపడుతోంది. సిగ్నల్ ఫ్రీ సిటీ లక్ష్యంగా ఇప్పటి వరకు సిటీలో 32 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. 33వ ప్రాజెక్టుగా ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నగరవాసులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. మామూలుగా లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో 5 జంక్షన్ల ఉంటాయి. ఎవరైన ఆర్టీసీ క్రాస్ రోడ్డు దాటి విద్యానగర్ వైపు వెళ్లాలంటే అరగంట టైం పడుతుంది. ఈ ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి దక్షిణ భారతంలోనే అతిపొడవైన 2.6 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, మూవీ థియోటర్ల జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బస్ భవన్, వీఎస్టీ వరకు ఈ స్టీల్ వంతెన నిర్మించారు. 

రెండున్నర ఏళ్లలో నిర్మాణం
2020 జులై 10న ఈ ఫ్లైఓర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. కేవలం రెండున్నర ఏళ్లలో 4 లైన్ల రోడ్‌తో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. రూ.450 కోట్ల అంచనా వ్యయం కాగా 12,500 మెట్రిక్ టన్నుల ఇనుమును ఉపయోగించారు. సన్నటి ఐరన్ పిల్లర్లు 81, 426 దూలాలు నిర్మించారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీద నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. జంక్షన్లు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో 2.6 కిలోమీటర్ల దూరమైన లోయర్ ట్యాంక్ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చు.

ఫ్లైఓవర్ ప్రత్యేకతలు
నగరంలో పలు చోట్ల ఫ్లై ఓవర్ల పై నుంచి మెట్రో లైన్ ఉంటుంది. కానీ ఇక్కడ మెట్రో లైన్ పైనుంచి వెళ్లేలా ఈ బ్రిడ్జి నిర్మించారు. సిటీలో మెట్రో లైన్‌పై నుంచి వెళ్తున్న తొలి ఫ్లైఓవర్ గా ఈ వంతెన ప్రత్యేకత దక్కించుకుంది. కాంక్రీట్ ఫ్లైఓవర్లతో పోలిస్తే స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ఖర్చు ఎక్కువై, కానీ తక్కువ టైంలో నిర్మాణాలను పూర్తి చేయొచ్చు. వందేళ్లకు పైగా మన్నిక ఉంటుందట. ఆగస్టు 19న ఈ ఇందిరా పార్క్ టూ వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నగరంలో మరో మైలురాయిగా నిలిచే ప్లై ఓవర్ తమ నియోజకవర్గంలో రావడంపై స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Citadel Honey Bunny First Review: 'సిటాడెల్: హనీ బన్నీ' ఫస్ట్ రివ్యూ... సమంత లేటెస్ట్‌ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
'సిటాడెల్: హనీ బన్నీ' ఫస్ట్ రివ్యూ... సమంత లేటెస్ట్‌ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Imane Khelif: ఆమె కాదు అతడే, ఇమాన్‌ ఖలీఫ్‌ మెడికల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ఆమె కాదు అతడే, ఇమాన్‌ ఖలీఫ్‌ మెడికల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Embed widget