KTR Curious: ట్రెండ్ అవుతున్న కేటీఆర్ క్యూరియస్ ట్వీట్- మంత్రి పోస్ట్‌కి గాలికి ప్యూరిఫైర్‌కి ఏం సంబంధం?
తెలంగాణ మంత్రి కేటీఆర్ క్యూరియస్ అంటూ చేసిన ట్వీట్ ట్రెండ్ అవుతోంది. ఆ ట్వీట్‌కి గాలి నుంచి కార్బన్‌ను వేరు చేసే టెక్నాలజీస్‌కి ఏం సంబంధం.
తెలంగాణ మంత్రి కేటీఆర్ క్యూరియస్... ఫుల్ డీటైల్స్ పంపండి అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఆదిత్య దూబే అనే పర్సన్ ఆస్క్ కేటీఆర్‌లో భాగంగా అడిగిన ప్రశ్నకు కేటీఆర్ జవాబిచ్చారు. క్లైమేట్ ఛేంజ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నినాదాల్లో ప్రధానమైంది కార్బన్ రిమూవల్. అసలేంటీ కార్బన్ రిమూవల్ అంటే వాతావరణంలో నుంచి దాన్ని ఎలా తగ్గించగలం..ఈ వీడియోలో చూద్దాం.
గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎన్విరాన్మెంట్‌ను దారుణంగా డ్యామేజ్ చేస్తున్నాయి. సో వీటిని వీలైనంత తగ్గించాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇదొక్కటే భూఉష్ణోగ్రతలను తగ్గించదు కానీ పారిస్ అగ్రిమెంట్ గోల్స్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఉష్ణోగ్రతలను కనీసం 1.5 సెంటీగ్రేడ్ మేర తగ్గించాలనేది ప్రతిపాదన. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా నెట్ జీరో ఎమిషన్స్‌ను సాధించాలని ఆ తర్వాత దాన్ని నెగటివ్ ఎమిషన్స్‌లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందు కోసం వాతావరణంలో నుంచి కార్బన్‌ను తొలగించటం అనేది అనుసరించాల్సిన ప్రధాన మార్గం. అందు కోసం కార్బన్ రిమూవల్లో ఏడు పద్ధతులను పర్యావరణవేత్తలు ప్రతిపాదించారు.
1. అడవుల పెంపకం & కాపాడటం:
అడవులను తయారు చేయటం, అడవులను కాపాడుకోవటం. ఈ రెండు పనులు చాలా కష్టమైనవే. కానీ వీటి ద్వారా వాతావరణం నుంచి కార్బన్‌ను తొలగించటం చాలా తేలిక అవుతుంది. ఈ పద్ధతి ద్వారా ఏడాదికి 6-11 Gt co2ను తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. 1 gtco2 అంటే వందకోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట. సో ఊహించుకోండి...చెట్లను నాటి అడవులు విస్తరించేలా చేయటం...పడిపోయిన చెట్ల ప్రదేశంలో కొత్త చెట్లను నాటడం, చెట్ల నరికివేతను నిలిపివేయటం ద్వారా ఎంత కార్బన్ డై ఆక్సైడ్ తగ్గించుకోవచ్చో.
2. వ్యవసాయ భూమి నిర్వహణ:
వ్యవసాయంలో భూ వినియోగం, దాని సంరక్షణ కూడా చాలా క్రూషియల్ రోల్ పోషిస్తోంది క్లైమేట్ ఛేంజ్‌లో. ప్రత్యేకించి సాగు కోసం అడవులను నరికేయటం, పోడు వ్యవసాయం, విపరీతంగా ఎరువుల వాడకం, రసాయనాలు క్రిమి సంహాకర మందుల మితిమీరిన వినియోగం లాంటివి భూసారాన్ని తగ్గిస్తున్నాయి. ఫలితంగా సాగు చేస్తున్న రైతులు నష్టపోవటంతోపాటు భూమి సమతుల్యత దెబ్బతింటోంది. సాగు యోగ్యంగా కాకుండా పోవటంతోపాటు కాలుష్యానికి కారణవుతోంది. దీన్ని సరిగ్గా మేనేజ్ చేసుకోగలిగితే ఏడాదికి 0.7gtc02 కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని పర్యావరణవేత్తల అంచనా.
3. బయో ఎనర్జీ వాడకం &నిల్వ
బయోఎనర్జీని వాడటం అనేది ప్రధానపాత్ర పోషించనుంది. బయో వ్యర్థాల ద్వారా ఎరువులను తయారు చేసుకోవటం దగ్గర నుంచి ఇందనవనురుల వరకూ అన్నింటా బయో ఎనర్జీని వినియోగించుకోవటం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చు. అంతే కాదు ఏడాదికి 2.1 gtco2 ను తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తల అంచనా
4. కార్బన్ మినరలైజేషన్:
కార్బన్‌ను మినరల్స్ రూపంలో మార్చటం మరో ప్రక్రియ. కార్బన్‌ను కార్బొనేట్ లాంటి సాలిడ్ మినరల్‌గా మార్చటం ద్వారా మళ్లీ వాతావరణంలో కలవకుండా చేయొచ్చనేది ఈ కాన్సెప్ట్. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమల్లో, ప్రాంతాల్లో ఈ కార్బన్ మినరలైజేషన్‌ను తక్కువ ఖర్చులో అందుబాటులో తీసుకురావటం ద్వారా ఏడాదికి 2-4 gtco2ను తగ్గించాలనేది ప్రతిపాదన.
5. డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్:
డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అనే టెక్నాలజీని వాడటం ద్వారా కెమికల్ రియాక్షన్స్ చేసి గాలి నుంచి కార్బన్ వేరు చేయొచ్చని కాన్సెప్ట్ ఉంది. ఈ ప్రాసెస్‌లో గాలి నుంచి ఈ సిస్టమ్స్ నుంచి పంపించటం ద్వారా Co2 ట్రాప్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఓ టన్ను గాలిని ఇలా ఫ్యూరిఫై చేయటానికి 300 నుంచి 600 అమెరికన్ డాలర్లు ఖర్చవుతోంది. కానీ యూత్ ఇన్నోవేషన్స్ ఐడియాస్‌ను కనుక ఇందులో ఇంప్లిమెంట్ చేయించి అడ్వాన్స్డ్ వెర్షన్స్ కనుక తీసుకువస్తే టన్ను గాలిని 100 డాలర్లకు ఫ్యూరిపై చేసే విధంగా కాస్ట్ ఆఫ్ ప్యూరిఫికేషన్ తగ్గించొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు ఓ డీఏసీ ప్లాంట్ ద్వారా ఏడాదికి 1mtco2 తగ్గించటంతోపాటు 3వేల 500 జాబ్స్‌ను క్రియేట్ చేయొచ్చనేది ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ క్యూరియస్ అని ట్వీట్ చేసింది ఈ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ గురించే.
6. మాస్ టింబర్
మాస్ టింబర్ అంటే ఇదివరకటి కాలంలో చెక్క ఇళ్లను వినియోగించటం..చెక్కతో ఆఫీసులు, కార్యాలయాలు కట్టుకోవటం. దీనివల్ల చెక్క, చెట్లు పెద్దమొత్తంలో వేస్ట్ అవుతున్నట్లు కనిపించినా...పర్యావరణానికి చాలు మేలు చేకూరుతుంది. ఏడాదికి 1gtc02 వరకూ కార్బన్ తగ్గించుకోవచ్చు. 25-40 శాతం కనస్ట్రక్షన్ పొల్యూషన్ కూడా తగ్గుతుందని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
7. నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా రీ వెట్టింగ్
నేచురల్ వాటర్ రీసోర్సెస్‌ను సమర్థంగా వినియోగించుకోవటం, నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా రీ వెట్టింగ్ సాధ్యమౌతుందని పర్యావరణవేత్తలు చెబుతారు. రీవెట్టింగ్ అంటే ఇప్పుడు వర్షం పడింది నీళ్లు వస్తాయి..లేదా కాలువలో నీళ్లు వచ్చినప్పుడు ఆ పల్లపు ప్రాంతాల్లోకి నీరు వస్తుంది. అలా సహజంగా వచ్చే నీటిని ఇలా అటవీ ప్రాంతాల్లో నిల్వ ఉండేలా చేయటం ద్వారా వైల్డ్ ఫైర్‌ను తప్పించవచ్చు. దాని ద్వారా co2 ఎమిషన్ తగ్గుతుంది. అంతే కాదు ఏడాదికి 0.8 gtco2 కార్బన్‌ను తగ్గించొచ్చని పర్యావరణవేత్తల అభిప్రాయం.
సో మొత్తం ఈ ఏడు పద్ధతులను వినియోగించటం, నెట్ జీరో ఎమిషన్ కోసం పరిశ్రమలు, ప్రభుత్వాలు బాధ్యతగా కట్టుబడి ఉండటం ద్వారా ప్రపచంవ్యాప్తంగా భూతాపాన్ని తగ్గించి కాలుష్యాన్ని కట్టడి చేయొచ్చనేది ఈ ప్రతిపాదనల వెనుక ఉన్న పరమార్థం.