Telangana Assembly: ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా..? మంత్రి పొన్నం ప్రభాకర్ కు క్లాస్ పీకిన శాసనమండలి చైర్మెన్
Ponnam Prabhakar | శాసన మండలిలో ఆశక్తిక సన్నివేశం చోటుచేకుంది. సభ నడుస్తున్న సమయంలో రోడ్లు గుంతలు, ప్రమాదాలపై పొన్నం ప్రభాకర్ కు మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు .
Telangana Assembly Sessions | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడవ రోజు వాడివేడిగా సాగాయి. అసెంబ్లీ లోపల ప్రతిపక్షం లేనిలోటు స్పష్టంగా కనిపించింది. కీలక తీర్మాానాలు, కృష్ణాజలాల వివాాదంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో కొనసాగింది. శాసనసభలో పరిస్దితి ఇలా ఉంటే శాసన మండలిలో ఆశక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సహజంగా శాసనమండలి చైర్మెన్ ప్రజా సమ్యలపై పెద్దగా మాట్లడరు. సభ్యులకు మాట్లడే అవకాశం కల్పించడం,సభను సవ్యంగా నడిపించడంపైనే మండలి చైర్మెన్ దృష్టి ఉంటుంది.సభ్యుల అభిప్రాయాలకు పెద్దపీట వేసే మండలి చైర్మెన్ నోట ఈరోజు ప్రజాసమస్యల ప్రస్తావ రావడంతో ఒక్కసారిగా అంతా షాకైయ్యారు. రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కు రోడ్ల గుంతలు,వాటి వల్ల జరుగుతున్నప్రమాదాలపై క్లాస్ తీసున్నారు.
మంత్రికి ఏం క్లాస్ పీకారు.. ఇంతకీ మండలి చైర్మెన్ ఏమన్నారంటే..
మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును ప్రస్తావిస్తూ, మంత్రిగారూ.. నావి కూడా రెండు మూడు సలహాలు వినండి. రాష్ట్రంలో మేజర్ యాక్సిడెంట్స్ కావడానికి కారణం ఆర్ అండ్ బి రోడ్లపైన గుంతులు అంటూ మొదలు పెట్టారు. ఇంతలో పొన్నం కల్పించుకుని మీ జిల్లా మంత్రికి క్లాస్ పీకండి అంటుండగా,ఇది అసెంబ్లీ కాబట్టి చెబుతున్నానంటూ సమాధానమిస్తూ కొనసాగించారు. రొోడ్లపై గుంతల వద్దకు రాగానే వాహనాలు షడన్ బ్రేకే వేస్తున్నారు, వెంటనే వెనుక నుండి వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొంటున్నాయి. చాలా వాహనాలు చట్టవిరుద్దంగా, నడిరోడ్డుమీదనే ఆపేస్తున్నారు. దాంట్లో మీ ఆర్టీసీ బస్సులున్నాయి, లారీలున్నాయి. ఆగి ఉన్న లారీకే గుద్దుకుని చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. అలాగే ఆగి ఉన్న బస్సులను గుద్దుకుని చనిపోయిన వారి సంఖ్య కూడా ఎక్కువే. కావాలంటే మీరు ప్రతీ ఏడాది ప్రమాదాల సంఖ్యను బయటకు తీయండి. ముఖ్యంగా సైరన్స్, నెంబర్ ప్లేట్లు అయితే ఇస్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా కార్లపై సైరెన్లు అయితే ఎవరి ఇష్టమొచ్చినట్లు వాళ్లు పెడుతున్నారు. వాహనాల నెంబర్ ప్లేట్లపై ఎమ్మెల్యే, పోలీసు అని రాసుకున్నా ఎవరూ పట్టించుకున్న పరిస్దితులు లేవు.
మీ శాఖలో వెహికల్ ఇస్పెక్టర్లు తనిఖీలు చేస్తున్నారా, చేస్తే ఎందుకు పట్టించుకోవడంలేదు. దయచేసి ఇలాంటి విషయాలను ఖచ్చితంగా పట్టించుకోవాలని కోరారు. పోలీస్ , ఆర్ అండ్ బీ, ట్రాన్స్ పోర్ట్ సమన్వయంతో పనిచేస్తే రోడ్దు ప్రమదాలు తగ్గుతాయి. అలాగే మల్కాపూర్ ఫిట్నెస్ సంటర్ ను మీరు నేను కలసి విజిట్ చేశాము. అది ప్లాన్ లో రాలేదు. వర్కవుట్ అవ్వట్లేదు. కేంద్రం 7కోట్లు ఇచ్చి తయారు చేసింద, నిరుపయోగంగా ఉంది. మరో ఎనిమిది కోట్లు పెడితే అది అప్డేట్ కాదు. ఆ ఎనిమిది కోట్లు పెద్ద సమస్యకాదు. మీరు సీరియస్ గా తీసుకుంటే ఆ ఫిట్ నెస్ సెంటర్ ను అందుబాటులోకి తేవచ్చు.
వేగం కన్నా.. ప్రాణం మిన్న.. ఇలా అనేక రకాల స్లోగన్స్ ఉన్నాయి. ప్రమాదాల నియంత్రణకు మీరు ఈ స్లోగన్స్ ఎందుకు ప్రచారం చేయడంలేదు.లారీల వెనక , బోర్డులు మెయిన్ రోడ్లపై ఈ స్లోగన్స్ పెట్టొచ్చు. ప్రమాదాలపై ప్రజల్లో అవగాహాన కల్పించొచ్చు. కానీ అలా ఎందుకు చేయడంలేదు. అది మీరు చేస్తారా, ఆర్ అండ్ బీ చేస్తారా, లేక పోలీసులు చేస్తారా అనేది మీరు వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ట్రెండింగ్ వార్తలు





















