By: ABP Desam | Updated at : 01 Apr 2023 05:10 PM (IST)
Edited By: jyothi
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మరో అవార్డు ( Image Source : Source: MP Santhosh Kumar Twitter )
Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించి.. దేశం మొత్తం పచ్చగా మారేందుకు ఎంతగానో కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కు అరుదైన గౌరవం దక్కింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అవార్డును సొంతం చేసుకుంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూస్ 18 గ్రూపు... గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను గుర్తించింది. గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అనివార్య కారణాల వల్ల ఎంపీ హాజరు కాలేకపోయారు. దీంతో శనివారం నెట్స్ వర్క్ 18 గ్రూప్ ప్రతినిధి ఎంపీ సంతోష్ కుమార్ ను హైదరాబాద్ లో కలిసి అవార్డును అందజేశారు.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, సామాజిక స్పృహ, అన్ని వర్గాల ప్రాతినిథ్యానికి కృషి చేస్తున్న సంతోష్ పై ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తున్నందుకు సంతోష్ కుమార్ గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపికైనట్లు న్యూస్ 18 సంస్థ తెలిపింది. పర్యావరణ మార్పుల వల్ల మానవాళికి పొంచి ఉన్న పెను ముప్పుపై అవగాహన కల్పించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న కృషి అమోఘమని సంస్థ ప్రతినిధులు అన్నారు.
Thank you @News18India for this recognition of #GreenRibbonChampions. This undoubtedly goes to millions who did their part in our #GreenIndiaChallenge initiative that had been started with the inspiration of our CM Sri #KCR sir. We will work hard further for a better tomorrow. pic.twitter.com/b2jloE25Xc
— Santosh Kumar J (@MPsantoshtrs) April 1, 2023
దీనిపై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్.. తనకు అవార్డు అందజేసిన న్యూస్ 18కు ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఫొటోలను షేర్ చేసిన ఆయన.. సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ లో లక్షలాది మంది భాగమయ్యారని పేర్కొన్నారు. రేపటి భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్
IIIT Hyderabad: హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో ప్రవేశాలు!
Jupally Krishna Rao Arrest: కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్, ఉద్రిక్తత
Gang Arrest : ఐటీ అధికారుల పేరుతో బంగారం దోపిడీ - గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు ! ఈ స్కెచ్ మమూలుగా లేదుగా
CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!