News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

గ్రేటర్‌లో నేడు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - ఆ లక్కీ పర్సన్స్‌ని ఎంపిక ఇలా

గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రభుత్వం రెడీ అవుతోంది. గ్రేటర్‌లోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్నవారిలో అర్హుల వివరాలను ప్రకటించనుంది.

FOLLOW US: 
Share:

అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ప్రభుత్వం ఊహించని నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రభుత్వం రెడీ అవుతోంది. గ్రేటర్‌లోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్నవారిలో అర్హుల వివరాలను ప్రకటించనుంది. మొత్తం 36,907 ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్‌ అలీలు వెల్లడించనున్నారు. లక్కీడ్రాలో ఎంపికైన 36,907 మందికి వచ్చే నెల  3, 5 తేదీల్లో ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించనున్నారు. 

తొలివిడతలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11వేల 700 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లను అందజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదేనని హెచ్చరించడంతో...లక్కీ డ్రాలో జాగ్రత్తగా వ్యవహరించనున్నారు. తప్పు చేసిన అధికారులపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండదని  మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అర్హుల ఎంపిక పూర్తిస్థాయి బాధ్యతను ప్రభుత్వం అధికారులకే అప్పగించినట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నామని స్పష్టం చేశారు. 

Published at : 27 Sep 2023 08:43 AM (IST) Tags: GHMC Lucky draw Double Bedroom

ఇవి కూడా చూడండి

Rythu Bharosa Funds: గుడ్‌న్యూస్, రైతుభరోసా విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ - రుణమాఫీపైనా కీలక ఆదేశాలు

Rythu Bharosa Funds: గుడ్‌న్యూస్, రైతుభరోసా విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ - రుణమాఫీపైనా కీలక ఆదేశాలు

CH Malla Reddy: రేవంత్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి ఒకే ఒక రిక్వెస్ట్ - ఏంటో తెలుసా?

CH Malla Reddy: రేవంత్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి ఒకే ఒక రిక్వెస్ట్ - ఏంటో తెలుసా?

Jana Reddy News: ఎంపీగా పోటీ చేయడానికి రెడీ, నా కుమారుడికి పదవులు అడగను - జానా రెడ్డి

Jana Reddy News: ఎంపీగా పోటీ చేయడానికి రెడీ, నా కుమారుడికి పదవులు అడగను - జానా రెడ్డి

TS LAWCET: తెలంగాణ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం, 13 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

TS LAWCET: తెలంగాణ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం, 13 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Google Map: గౌరవెల్లి ప్రాజెక్టులోకి దారి చూపిన గూగుల్‌ మ్యాప్‌-తృటిలో తప్పించుకున్న డీసీఎం డ్రైవర్‌

Google Map: గౌరవెల్లి ప్రాజెక్టులోకి దారి చూపిన గూగుల్‌ మ్యాప్‌-తృటిలో తప్పించుకున్న డీసీఎం డ్రైవర్‌

టాప్ స్టోరీస్

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు