By: ABP Desam | Updated at : 06 Mar 2023 09:59 PM (IST)
27 మంది మహిళలకు పురస్కారాలు
Telangana govt announces awards to 27 women:
హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పలు రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఈ స్పెషల్ అవార్డులకు ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళీకేరి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది (2023) కు గానూ మొత్తం 27 మంది మహిళలను అవార్డుతో పాటు ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని సర్కార్ అందజేయనుంది.
అవార్డులు పొందిన మహిళలు వీరే..
- బానోతు జ్యోతి – అంగన్‌వాడీ టీచర్
- ఎం. కృష్ణవేణి – ఆశా వర్కర్
- ఇందిర – ఏఎన్ఎం
- గుండా రాజకుమారి – సెంటర్ కోఆర్డినేటర్, భరోసా సెంటర్
- ఆల్ఫి కిండన్‌జెన్ – సోషల్ సర్వీస్
- మీనాక్షి గాడ్గె – ముఖ్రా కే సర్పంచ్
- డాక్టర్ అనురాధ తడకమళ్ల – క్లాసికల్ డ్యాన్స్
- దంటు కనకదుర్గ – సోషల్ యాక్టివిస్ట్
- సుజాత దీక్షిత్ – థియేటర్
- స్వరూప పొట్లపల్లి – జర్నలిజం
- డాక్టర్ బండారు సుజాత శేఖర్ – ఫోక్ లిటరేచర్
- కర్నె శంకరమ్మ – కిన్నెర, ఫోక్
- అరుణ నారదభట్ల – లిటరేచర్
- డాక్టర్ అమూల్య మల్లన్నగారి – హెల్త్
- నారా విజయలక్ష్మి (పీహెచ్) – పెయింటర్
- ఓఎన్ఐ సిస్టర్స్(వినోద, విజయ, విజయలక్ష్మి) – మ్యూజిక్
- త్రిష గొంగడి – స్పోర్ట్స్ (అండర్ -19 క్రికెటర్)
- డాక్టర్ మాలతి – హెల్త్, సూపరింటెండెంట్, ఎంజీఎంహెచ్, పేట్లబుర్జ్
- సమంత రెడ్డి – ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్
- డాక్టర్ గుడూరు మనోజ – ఆద్య కళ
- సామళ్ల శ్వేత – కమ్యూనిటీ మొబిలైజేషన్
- జి. నందిని – సూపర్‌వైజర్, నిజామాబాద్ (అ) ప్రాజెక్ట్
- రజియా సుల్తానా – ఏడబ్ల్యూహెచ్, కౌడిపల్లి, ఐసీడీఎస్ – నర్సాపూర్
- డాక్టర్ కే రాణి ప్రసాద్ – లిటరేచర్
- రుక్మిణి, ఇన్‌స్పెక్టర్ – షీ టీమ్స్ భరోసా సెంటర్
- అనసూయ, ఐపీఎస్, డీసీపీ – పోలీసు డిపార్ట్‌మెంట్
- అన్వితా రెడ్డి – మౌంటెయినర్
మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. మార్చి 8న రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈనెల 8న రూ.750 కోట్ల రుణాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 మహిళా ఆస్పత్రులు నిర్మిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ముందు 100 ఆస్పత్రులు నిర్మించి క్రమంగా వాటి సంఖ్య పెంచుతామన్నారు. ఆరోగ్య మహిళల పేరుతో ఈ ఆస్పత్రులను త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. ప్రతి మంగళవారం ఆస్పత్రిలో మహిళా సిబ్బందే ఉంటారన్నారు. సంగారెడ్డి జిల్లాలో మహిళా సమైక్య దుకాణ సముదాయాల నిర్మాణానికి ఇటీవల మంత్రి హరీశ్ రావు భూమిపూజ చేశారు.
Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!
KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!
Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!
TSPSC Paper Leak: వాట్సాప్ ద్వారానే 'గ్రూప్-1' ప్రశ్నపత్రాలు చేరవేశారు! కమిషన్ కార్యాలయం నుంచే మొత్తం వ్యవహారం!
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?
COOKIES_POLICY