Telangana Police Medals: 11 మందికి శౌర్య పతకం, 19 మందికి మహోన్నత సేవా పతకం- పోలీస్ మెడల్స్ ప్రకటించిన తెలంగాణ
TG Police Seva medals | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పోలీస్ సేవా పథకాలను ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Police Medals: హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు సేవా పతకాలు (Police Seva Medals)ను ప్రకటించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సేవా పతకాలపై హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
శౌర్య పతకాలు, మహోన్నత సేవా, ఉత్తమ సేవా, కఠిన సేవా పతకాలు
పోలీసుశాఖలోని గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన 9 మందిని శౌర్య పతకం వరించింది. 16 మంది పోలీసులకు మహోన్నత సేవా పతకం, 92 మంది ఉత్తమ సేవా పతకం, 47 మంది పోలీసులకు కఠిన సేవా పతకం, 461 మందికి సేవా పతకం ప్రదానం చేయనున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలో ఒకరికి ఉత్తమ సేవా పథకం, ఐదుగురికి సేవా పతకాలు లభించాయి.
డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ శాఖ (Fire Service Department)లో ఇద్దరికి శౌర్య పతకం రాగా, ఒకరికి మహోన్నత పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పథకాలు, 14 మందికి సేవా పతకాలు ప్రకటించారు. ఇక అవినీతి నిరోధక శాఖ (ACB)లో ఒకరికి మహోన్నత సేవా పథకం, నలుగురికి ఉన్నత సేవా పథకం రాగా, మరో 17 మందిని సేవా పతకాలు వరించాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఒకరికి మహోన్నత సేవా పథకం రాగా, ముగ్గురికి ఉత్తమ సేవా పథకాలు, 15 మందికి సేవా పతకాలను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రకటించింది.






















