TS Governor VS CM: సీఎం కేసీఆర్‌తో పని చేయడం నాకు పెద్ద సవాల్, నేను రబ్బర్ స్టాంప్ కాదు- తెలంగాణ గవర్నర్‌ సీరియస్ కామెంట్స్

తెలంగాణలో గవర్నర్, సీఎం మధ్య అంతరం మరింత పెరుగుతోంది. రోజూ ఏదో సందర్భంలో సీఎంను టార్గెట్ చేసుకొని గవర్నర్‌ కామెంట్స్‌ చేయడం కలకలం రేపుతోంది.

FOLLOW US: 

నిన్నటికి నిన్న ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేసిన తెలంగాణ గవర్నర్‌ తమిళి సై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో పని చేయడం తనకు పెద్ద సవాల్‌ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల సీఎంలతో పని చేస్తున్నానని... ఇద్దరూ భిన్నమైన వ్యక్తులని అభిప్రాయపడ్డారు. 

సీఎం చెప్పిన చోటల్లా సంతకాలు చేయడానికి తానేమీ రబ్బర్‌ స్టాంప్ కాదన్నారు గవర్నర్‌ తమిళిసై. సమస్యలు ఉంటే ప్రశ్నిస్తానన్నారు. తనను వేరే రాష్ట్రానికి మారుస్తారన్నది కరెక్ట్ కాదన్నారు. దిల్లీ వెళ్లిన వెంటనే తనపై దుష్ప్రచారం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సీఎం, గవర్నర్ కలిసి పనిచేయకపోతే ఎలా ఉంటుందో తెలంగాణ చూస్తే అర్థమవుతుందన్నారామె. సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేయడం కష్టమన్నారు. ఎక్కడైనా రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శిస్తుంటారని... తెలంగాణ మాత్రం గవర్నర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 

నిన్న కూడా తెలంగాణ గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య హాట్ హాట్ గా విమర్శలు కొనసాగుతున్నాయి. గవర్నర్, ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతున్న క్రమంలో తమిళి సై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళలని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా విమర్శించారన్నారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేశారని గవర్నర్ గుర్తుచేశారు. తాను ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని అనలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ తో భేదాభిప్రాయాలున్నా రాజ్ భవన్ ను గౌరవిస్తున్నారన్నారు. తెలంగాణ గవర్నర్ గా మాత్రమే పని చేస్తానన్న ఆమె రాజకీయం చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. తనకి రాజకీయం చెయ్యాలనే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు. ఇటీవల గవర్నర్ తమిళి సై దిల్లీలో పర్యటన చేశారు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రానికి ఆమె ఫిర్యాదు చేశారన్న వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను ఆమె కేంద్రానికి తెలిపారని మంత్రులు ఆరోపించారు. దీంతో గవర్నర్ పై మంత్రులు వరుసగా విమర్శలు మొదలుపెట్టారు. 

ఆహ్వానాలకు రాజకీయాలు ఆపాదిస్తున్నారు

తాజాగా ఈ విషయాలపై స్పందించిన గవర్నర్ తమిళి సై తనపై మంత్రులు చేస్తున్న విమర్శలను ఖండించారు. రాజకీయం చేస్తున్నట్లు అనవసరంగా విమర్శిస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తే రాజకీయం అంటున్నారని, ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారన్నారు. ఏ పదవిలో ఉన్నా, ప్రజలకు సేవ చేయుటమే తన లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు. తన పర్యటనలో ప్రొటోకాల పాటించడంలేదన్న విషయంలో ఆమె స్పందించారు. ప్రోటోకాల్ విషయంలో కేంద్రం తన పని తాను చేసుకుపోతుందన్నారు. గిరిజనుల మంచి కోసం వాళ్ల ప్రాంతాల్లో పర్యటిస్తున్నానన్నారు. తన ఆహ్వానాలకు రాజకీయాలను ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వ విషయంలో ప్రతినెలా నివేదికలు ఇస్తున్నట్లు తెలిపారు. నివేదికలో అన్ని విషయాలను పేర్కొనడం జరుగుతుందన్నారు. 

గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం 

గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మద్య గ్యాప్‌ పెరిగినట్లు వార్తలు వినిపించడంతో ఏకంగా గవర్నర్‌ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేయగా కొందరు మంత్రులు సైతం అంతే దీటుగా ప్రతి విమర్శలు చేశారు. ఈ పంచాయతీ కాస్తా డిల్లీ వరకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన కనీస ప్రొటోకాల్‌ను అమలు చేయడం లేదని ప్రధాని నరేంద్రమోడికి, హోం మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డిల్లీ నుంచి వచ్చిన గవర్నర్‌ తమిళ్‌ సై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ప్రొటోకాల్‌ను పాటించడం లేదని మీడియా సాక్షిగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మద్య గ్యాప్‌ మరింతగా పెరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Published at : 19 Apr 2022 03:25 PM (IST) Tags: telangana Telangana CM KCR Telangana CM Telangana Governor Tamilisai Soundararajan

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్

Breaking News Live Updates: ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు