Hyderabad Lands Auction : కోకాపేటలో ఎకరం రూ. 72 కోట్లు - వేలంలో తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట !
కోకాపేట భూముల వేలంలో తెలంగాణ సర్కార్‌కు భారీ ఆదాయం లభిచింది. గురువారం వేలంలో 1532 కోట్లు వచ్చాయి.
Hyderabad Lands Auction : హైదరాబాద్ శివారులోని కోకాపేటని యోపాలిస్ భూముల వేలం సర్కార్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. గతేడాది కంటే ఈ సారి వేలంలోరికార్డు స్థాయి ధరకు ప్లాట్లు అమ్ముడుపోయాయి. అత్యధికంగా ఎకరం 72 కోట్లు పలికగా... అతి తక్కువగా 51.75 కోట్లు అమ్ముడుపోయింది. మొత్తంగా నాలు ప్లాట్లకు రూ. 1532.5 కోట్లు పలికింది. కోకాపేటలో ఉన్న 45.33 ఎకరాల్లో ఉన్న 7 ప్లాట్లకు హెచ్ఎండీ వేలం నిర్వహించింది. ఇంకా మూడు ప్లాట్లను వేలం వేయనుంది. ఈ వేలం ద్వారా దాదాపు రూ. 2500 కోట్లు రాబట్టాలని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021లో ఇదే ఏరియాలో వేలం నిర్వహించగా కనిష్టంగా ఎకరా రూ. 31 కోట్లు ,గరిష్టంగా రూ. 60 కోట్లు పలికింది.
మొత్తంగా ఈ విడతలో కోకాపేటలోని 45 ఎకరాలను అమ్మకానికి ఏర్పాట్లు చేసింది. రెండు సెషన్ లుగా భూములు వేలం జరుగుతోంది. సర్కార్ ఎకరాకు 35 కోట్లుగా ధర నిర్ధారించింది కోకాపేటలో అభివృద్ధి చేసిన లే అవుట్ కోసం హెచ్‌ఎండీఏ సుమారు రూ. 300 కోట్ల రూపాయలను వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది. సుమారు 41 ఎకరాలను రకరకాల వసతుల కోసమే కేటాయించారు. లేఅవుట్‌లోని రోడ్లన్నీ 45 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల రహదారి, 36 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ 45.33 ఎకరాల భూమి అమ్మకంతో భారీగా ఆదాయం రానుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధిచేసిన కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లో ప్లాట్లు కొంత కాలంగా వేలం వస్తున్నారు. 2021లో మొదటి ఆన్‌లైన్ వేలం నిర్వహించారు. మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను వేలం వేశారు. అప్పట్లో ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు. ఇందులో ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది. 2/పీ వెస్ట్ పార్ట్ గల ప్లాట్‌ను రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతంచేసుకున్నది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం సమకూరింది.
కోకాపేటలో ఇప్పటికే 58 అంతస్తుల వరకు వ్యాపార, వాణిజ్య, నివాస భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్‌లోనూ అదే స్థాయిలో హై రైజ్ అపార్ట్‌మెంట్లు నిర్మించడానికి అవకాశం ఉండటంతో బిడ్డర్లు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఔటర్ రింగురోడ్డును అనుకొని ఉండటంతోపాటు పక్కనే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఉండటం వల్ల ఈ భూములకు ప్రాధాన్యం పెరిగింది. నియోపోలిస్ లే అవుట్‌లోని 8 ప్లాట్లను ఒకే రోజు ఆన్‌లైన్ వేలం విక్రయించారు.